తెలంగాణ మంత్రి కేటీఆర్ రాజకీయంగా తన కన్నా తెలివి గల వాళ్లు లేరని అనుకుంటూ ఉంటారు. ఆయన ఏమన్నా బీఆర్ఎస్ మీడియా, సోషల్ మీడియా టీం విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉంటాయి. అలా కర్ణాటక కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి ఆయన చేసిన వ్యాఖ్యలను కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తోంది.కానీ ఆ ప్రచారం కాస్తా రివర్స్ అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి రావాలని ఆయన కోరుకుంటున్నట్లుగా ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
కర్ణాటక మేనిఫెస్టో తెలంగాణలో అమలు చేయాలంటున్న కేటీఆర్
కర్ణాటక ఎన్నికల కోసం బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. నిరుపేదలకు అరలీటర్ పాలు ఫ్రీ హెల్త్ చెకప్ ఫ్రీ, మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలను ఇచ్చింది. దీనిపై కేటీఆర్ విమర్శలు చేశారు. కర్ణాటకలో సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీ గాఎలా ఇవ్వగలరో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. ఒకవేళ అలా ఇవ్వగలిగితే తెలంగాణ ప్రజలకు ఎందుకు మూడు సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీగా ఇవ్వరు అంటూ గొప్పగా ప్రశ్నించానని అనుకున్నారు. కేటీఆర్ మాటలను మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. కానీ అసలు విషయం మర్చిపోయారు. ఎందుకంటే అది కర్ణాటక మేనిఫెస్టో.
కేటీఆర్ పబ్లిసిటీతో తెలంగాణలోనూ మూడు సిలిండర్ల హామీ!
కర్ణాటక మేనిఫెస్టోను చూపించి తెలంగాణ ప్రజలకు ఎందుకు ఇవ్వరని కేటీఆర్ ప్రశ్నించడం .. దాన్ని ఆ పార్టీ నేతలు హైలెట్ చేయడంతో ఇప్పుడు ఓ చర్చ ప్రారంభయింది. తెలంగాణ ప్రజలకు మూడు ఉచిత సిలిండర్లు బీజేపీ ఇస్తుందని.. ఇవ్వదని ఎవరు చెప్పారని అంటన్నారు. ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితం అనేది కర్ణాటక రాష్ట్ర బీజేపీ హామీ ! అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే ఇస్తుంది – తెలంగాణలోనూ బీజేపీ గెలుస్తుంది ఇస్తుందని అంటున్నారు. తెలంగాణలో కూడా బీజేపీ అలాంటి హామీ ఇస్తుందని..అధికారంలోకి రాగానే ఇస్తుందని అంటున్నారు. కేటీఆర్ చేసిన మూడు సిలిండర్ల కు ఇచ్చిన ప్రచారంతో తెలంగాణ బీజేపీ నేతలు దాన్ని అంది పుచ్చుకోవాలనుకుంటున్నారు. ఆ హామీకి విస్తృత ప్రచారం కల్పించి.. తమ మేనిఫెస్టోలనూ పెట్టాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
పెట్రోల్, డీజిల్ ధరలతో ఇప్పటికే తెలంగాణ ప్రజలపై పెనుభారం
తెలంగాణ సర్కార్ దేశంలోనే అత్యధికంగా పన్నులు వసూలు చేస్తున్న రాష్ట్రాల్లో ఒకటి. ముఖ్యంగా పెట్రోల్, డిజిల్ పై కేంద్రం చాలా సార్లు పన్నులు తగ్గించినా ఇప్పటి వరకూ ఒక్క సారి కూడా తెలంగాణ సర్కార్ తగ్గించలేదు. అదేమంటే పెంచింది మేము కాదంటూ.. ఎదురుదాడి చేస్తున్నారు. ప్రజల్ని దోపిడి చేస్తూనే ఉన్నారు. కానీ ప్రతీ విషయాన్ని కేంద్రాన్ని నిందిస్తూనే ఉంటారు. ఇప్పుడు కర్ణాటక బీజేపీ మేనిఫెస్టోపై విమర్శలతో ఆయన సెల్ఫ్ గోల్ చేసుకున్నారన్న వాదన వినిపిస్తోంది.