ఓజీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

ప్రస్తుతం పవన్ కల్యాణ్.. సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా మహారాష్ట్రలో జరుగుతోంది. మొన్నటివరకు యాక్షన్ సన్నివేశాలు తీశారు. ప్రస్తుతం హీరోయిన్ ప్రియాంక-పవన్ మధ్య పాటని పిక్చరైజ్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ కంప్లీట్ అవ్వగానే హైదరాబాద్ వచ్చేసి క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాను కంప్లీట్ చేస్తాడు. ఈ రెండు సినిమాలతో పాటు సాయి ధరమ్ తేజ్ తో నటిస్తున్న సినిమాలో పవన్ నటిస్తున్న సీన్లు ఇప్పటికే పూర్తయ్యాయి. వీటితో పాటు హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ పనులు కూడా వేగవంతం అయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ నడుస్తున్నాయి.
ఒకేసారి ఇన్ని సినిమాలు ఎందుకు.?
వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు ఉన్నాయి. మే నాటికి కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయాలి. అంటే ఎలా చూసినా డిసెంబరు జనవరి నాటికి నోటిఫికేషన్ వస్తుంది. ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అభ్యర్థుల ఎంపికలో పవన్ బిజీ అయిపోతాడు. దీనికితోడు ఈసారి టీడీపీతో పొత్తు ఉంటుందని చెప్పకనే చెప్పారు. దీంతో పవన్ ఫుల్ బిజీ. ప్రచారాలు, రోడ్ షోలు, క్యాంపెయిన్ లు ఒక్కటేమిటీ క్షణం తీరిక ఉండదు. అందుకే ఎన్నికలు నాటికి అన్ని సినిమాలు కంప్లీట్ అవ్వాలని నాన్ స్టాప్ గా షూటింగ్స్ చేస్తున్నాడు. ఒకవేళ అటు ఇటుగా అయినా ఉస్తాద్ భగత్ సింగ్ ఆగుతుందేమో కానీ మిగిలిన సినిమాల్ని మాత్రం కంప్లీట్ చేసి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్.