గోపీచంద్ హీరోగా నటించిన రామబాణం
చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. శ్రీవాస్ దర్శకుడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ సినిమాలో డింపుల్ హయాతీ హీరోయిన్ కాగా.. ఖుష్బు, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మే 5న విడుదల కానున్న ఈసినిమాకు సంబంధించి జోరు పెంచింది యూనిట్. ఇందులో భాగంగా సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు నిర్మాత టిజి విశ్వప్రసాద్. అన్నిటికన్నా ఆసక్తికరమైనది ఏంటంటే.. రామబాణం టైటిల్ ఫిక్స్ చేసింది మరెవరో కాదు నందమూరి నటసింహం బాలకృష్ణ.
గోపీచంద్ సినిమాకు బాలకృష్ణ టైటిల్ ఫిక్స్ చేయడం ఏంటి..అసలు ఆ సందర్భం ఎక్కడొచ్చిందో తెలుసా… అన్ స్టాపబుల్ విత్ NBK షోలో. ఈ షోలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కలసి పార్టిసిపేట్ చేశాడు గోపీచంద్. ఆసమయంలో గోపీచంద్ కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది. కెరీర్లో ప్రభాస్ రిస్క్ చేశాడు కాబట్టే పాన్ ఇండియా స్టార్ గా మారాడు..నువ్వు కూడా రిస్క్ చేయకపోతే మిగిలేది రస్కే అంటూ బాలయ్య తనస్టైల్లో చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా తన సినిమాలకు సింహం టైటిల్ ఎలా సెంటిమెంటో..గోపీచంద్ సినిమాలకు చివర్లో సున్నా సెంటిమెంట్ అనే విషయం గుర్తుచేస్తూ అనుకోకుండా ఈ సారి రామబాణం అని పెట్టమని ఫిక్స్ చేశాడు. అప్పటికే గోపీచంద్ సినిమా టైటిల్ విషయంలో చర్చలు జరుగుతున్నాయి..ఇలాంటి టైమ్ లో బాలయ్య నోటినుంచి వచ్చిన ‘రామబాణం’ టైటిల్ ఫైనల్ చేశారు. బాలయ్య నోటిమాట ప్రకారం రామబాణం దూసుకెళ్తుందని ఫిక్సయ్యారు.
ఇక పీపుల్స్ మీడియా విషయానికొస్తే..పలు క్రేజీ ప్రాజెక్ట్ లను నిర్మిస్తోంది. అందులో భాగంగా ప్రభాస్- మారుతి ప్రాజెక్ట్, పవన్ కళ్యాణ్-సాయిధర్ తేజ్ మూవీస్ కూడా ఉన్నాయి. వీటితో పాటూ మరో పది ప్రాజెక్టుల వరకూ సెట్స్ పై ఉన్నాయి. ఆ తర్వాత లైన్లో ఉన్న ప్రాజెక్టుల సంఖ్య కూడా ఎక్కువే. ఇలాంటి సంస్థతో సినిమా గోపీచంద్ కెరీర్ ను మలుపుతిప్పుతుందనే నమ్మకంతో ఉన్నారు.
మంచి బలమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా తప్పనిసరిగా విజయం సాధిస్తుందంటున్నారు. పైగా బాలయ్య టైటిల్ పెట్టడంతో .. లౌక్యం, లక్ష్యం లాగే రామబాణం కూడా హిట్టవుతుందనే నమ్మకం ఉందన్నాడు గోపీచంద్. మరి ఈ బామం పవరేంటో మే 5న తెలిసిపోతుంది…