ఉరకల పరుగుల జీవితంలో మీకోసం మీరు ఓ పదినిముషాలు కేటాయించుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. సూర్య నమస్కారాలు ఒక నిర్దిష్ట క్రమంలో చేసే ప్రసిద్ధ యోగాభ్యాసం. ఇందులో 12 భంగిమలు ఉంటాయి. ఈ 12 భంగిమలు రోజూ వేయడం వల్ల శరీరంలోని వివిధ భాగాలు ఆరోగ్యంగా మారుతాయి. సంపూర్ణ శారీరక, మానసిక శ్రేయస్సుకు ఈ సూర్య నమస్కారాలు సహకరిస్తాయి. పైగా మీరు నిత్యం చేసే వర్కౌట్స్ కన్నా సూర్య నమస్కారాల వల్ల కరిగే క్యాలరీస్ కన్నా సూర్యనమస్కారాల వల్ల కరిగే క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి.
ఏం చేస్తే ఎన్ని క్యాలరీస్ తగ్గుతాయి
అరగంట వెయిట్ లిఫ్టింగ్ వల్ల 199 క్యాలరీస్
టెన్నిస్ వల్ల 232 క్యాలరీస్
ఫుట్ బాల్ వల్ల 298 క్యాలరీస్
రాక్ క్లైంబింగ్ వల్ల 364 క్యాలరీస్
రన్నింగ్ వల్ల 414 క్యాలరీస్
అయితే కేవలం సూర్యనమస్కారాల వల్ల 417 క్యాలరీలు కరుగుతాయని పరిశోధనల్లో పేర్కొన్నారు. అంటే పది నిమిషాల సూర్య నమస్కారాల వల్ల 139 క్యాలరీస్ తగ్గుతాయి.
సూర్య నమస్కారాల వల్ల ఉపయోగాలివే
- సూర్య నమస్కారాలు నిర్దిష్ట క్రమంలో చేయడం వల్ల శరీరం మొత్తానికి మెరుగైన రక్తప్రసరణ జరుగుతుంది. దీనివల్ల అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉంటాయి.
- సూర్య నమస్కారాల్లో చాలా భంగిమలు ముందుకు, వెనక్కు వంగి చేయాల్సి వస్తుంది. ఇలా చేయడం వల్ల కండరాలు వ్యాకోచిస్తాయి. శరీరం మొత్తం చురుగ్గా మారుతుంది.
- సూర్య నమస్కారాలు చేయడం వల్ల క్యాలరీలు ఎక్కువగా బర్న్ చేసుకోవచ్చు. బరువు తగ్గడానికి కూడా ఇది సహకరిస్తుంది. కండరాలను కాపాడడంతో పాటు జీవక్రియలు చురుగ్గా సాగేలా చేస్తుంది.
- ఒత్తిడి, ఆందోళనతో బాధపడే వారికి సూర్య నమస్కారాలు తగిన యోగాభ్యాసం. వీటిని రోజూ చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన స్థాయిలు తగ్గుతాయి. ప్రశాంతమైన మనసు లభిస్తుంది.
- సూర్య నమస్కారాలు పొట్ట ప్రాంతానికి రక్తప్రసరణను పెంచుతాయి. దీనివల్ల జీర్ణక్రియ మెరుగ్గా, ప్రభావంతంగా జరుగుతుంది. పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది.
- చేతులు, కాళ్లు, కండరాలు గట్టిపడతాయి. శరీరం అభివృద్ధి చెందుతుంది.
- నడుము సన్నగా ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. సూర్య నమస్కారాలు రోజూ చేస్తే నడుము సన్నబడి, మెరుపుతీగలా మారతారు.
- శరీరంలోని ప్రతి అవయవంలోని వ్యర్థాలను, విషపదార్థాలను తొలగించే శక్తి వీటికి ఉంది
సూర్య నమస్కాలు సూర్య కిరణాలు శరీరాన్ని తాకుతుండగా చేయాలి. ఇలా చేయడం వల్ల కిరణాలు శరీరంలోకి ప్రవేశించి శుద్ధి చేస్తాయి. ఆలోచన శక్తిని కూడా మారుస్తాయి. సూర్య నమస్కారాల్లో కొన్నింటిని వేగంగా చేస్తే, కొన్నింటినీ నెమ్మదిగా చేయాలి. సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. థైరాయిడ్ సమస్య ఉన్న వారు సూర్య నమస్కారాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వీటిపై సందేహాలను వైద్యులను సంప్రదించిన తర్వాత నివృతి చేసుకోగలరు.