దోచుకున్నదే కాక పేరూ మార్చేస్తారా – సీతకొండ పేరు మార్పుపై ఏపీ బీజేపీ ఉద్యమం !

విశాఖలో సీతకొండ వ్యూ పాయింట్‌కు ఎంతో పేరు ఉంది. ఇటీవల జీ 20 సమవేశాల సందర్భంగా కేంద్రం పెద్ద ఎత్తున విశాఖ అభివృద్ధికి నిధులు ఇచ్చింది. అందులో భాగంగా సీత కొండ వ్యూ పాయింట్‌ను జీవీఎంసీ అధికారులు అభివృద్ధి చేశారు. కనీసం రూ. యాభై లక్షలు కూడా చేయని పనులకు రూ. మూడున్నర కోట్ల వరకూ బిల్లులు పెట్టుకుని దండుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అలా కేంద్రం నిధులతో అభివృద్ధి చేయడమే కాదు.. ఏకంగా వైఎస్ఆర్ పేరు పెట్టేసుకున్నారు.దీనిపై బీజేపీ నేతలు ఉద్యమం ప్రారంభించారు.

బీజేపీ నేతల్ని హౌస్ అరెస్ట్ చేయించిన వైసీపీ

ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్న విశాఖ సీత కొండ కు వైఎస్ఆర్ వ్యూ పాయింట్ గా నామకరణాన్ని చేయడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు ఉద్యమం చేయడానికి పిలుపునిచ్చారు. సోేమవారం రోజు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్దమయ్యారు. అయితే పోలీసులు ఉదయం నుంచి వారిని హౌస్ అరెస్ట్ చేశారు. విశాఖ లో సీత కొండ పేరు మార్చడం అన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమానికి పిలుపు నివ్వడం తో మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ తో సహా బిజెపి నేతలను విశాఖ పోలీసులు లఅదుపులోకి తీసుకున్నారు. దీనిపై మాధవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ప్రభత్వం సంక్షేమ, అభివృద్ది పధకాలకు స్టిక్కర్లు వేసుకోవడానికి అలవాటు పడి సీత కొండ కు పేరు మార్చేసింది ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి శాశ్వత సిఎం అనుకుంటున్నారా అని మాధవ్ ఎద్దేవా చేశారు. వైఎస్ ఆర్ వ్యూ గా పేరు మార్చడంతో స్ధానికులు ప్రభుత్వాన్ని అసహ్యంచుకుంటున్నారన్నారు.

స్టిక్కర్ల ప్రభుత్వమని నిరూపించుకుందన్న సోము వీర్రాజు !

హౌస్ అరెస్టులతో ఉధ్యమాన్ని నిలువరించలేరు సీత కొండ పేరు తిరిగి నామకరణం చేసేంతవరకు తమ పోరాటం కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని సోము వీర్రాజు హెచ్చరించారు. ఈ మేరకు తన నివాసం నుండి మీడియాకు లేఖ విడుదల చేశారు. సీతకొండ వ్యూ పాయింట్ పేరు మార్పునలకు వ్యతిరేకంగా ఉద్యమానికి పిలుపునిస్తే విశాఖ పోలీసులు బిజెపి నేతలను హౌస్ అరెస్టు చేయటం పై బీజేపి రాష్ట్ర అద్యక్షుడు సొము వీర్రాజు మండిపడ్డారు.రాష్ట్ర ప్రభత్వం సంక్షేమ, అభివృద్ది పధకాలకు స్టిక్కర్లు వేసుకోవడానికి అలవాటు పడి సీత కొండ కు పేరు మార్చేసింది ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి శాశ్వత సిఎం అనుకుంటున్నారా అని ఎద్దేవా చేశారు.

ప్రభుత్వానికి టైం దగ్గర పడిందన్న విష్ణువర్ధన్ రెడ్డి !

బీజేపీ నేతల హౌస్ అరెస్టులపై ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి కూడా మండిడ్డారు. జీ 20 మీట్ కోసం సీతకొండ అభివృద్ధికి కేంద్రం నిధులిచ్చిందని.. కేంద్రం నిధులతో అభివృద్ధి చేసి.. ఇప్పుడు సీతకొండ పేరు మారుస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నించిన బీజేపీ నేతల్ని హౌస్ అరెస్టులు చేయిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేసారు. అధికార అహం నెత్తికెక్కి ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని గుర్తుచేస్తున్నామని.. బేషరతుగా అందర్నీ విడుదల చేసి.. తక్షణం సీతకొండ వ్యూ పాయింట్ పేరును గతంలోనిదే ఉంచాలని డిమాండ్ చేశారు.