బిచ్చగాడు 2 ట్రైలర్ చాలా రిచ్ గా ఉంది, మరో హిట్టు పక్కానా!

కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని హీరోగా వచ్చిన ‘బిచ్చగాడు’ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. టైటిలేంటి ఇలా ఉందని, విజయ్ ఆంటోని హీరో ఏంటని అనుకున్నవాళ్లంతా..ఆ సినిమా కలెక్షన్లు చూసి అవాక్కయ్యారు. 2016లో సైలెంట్ గా వచ్చి సూపర్ డూపర్ హిట్టుగా నిలిచిన బిచ్చగాడు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాకు సీక్వెల్ గా బిచ్చగాడు-2 రాబోతుంది. విజయ్ ఆంటోని స్వీయ దర్శకత్వంలో తానే హీరోగా ఈ సినిమాను తెరకెక్కించాడు..ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ విడుదల చేసింది చిత్రబృందం.

ట్రైలర్లో ఏముందంటే
విజయ్ ఆంటోని చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించాడు. విజయ్ గురుమూర్తి.. ఇండియాలో 7వ అత్యంత ధనవంతుడు. లక్ష కోట్ల రూపాయలకు వారసుడు అంటూ దేవ్ గిల్ చెప్పే మాటలతో ట్రైలర్ మొదలవుతుంది. స్టైలిష్ లుక్ లో స్పెషల్ ఫ్లైట్ లోకి ఎక్కబోతున్నట్లు చూపిస్తారు. ఆ తర్వాత విజయ్ ఆంటోని అయ్యప్ప మాలతో పోలీస్ స్టేషన్ లోకి వస్తూ కనిపించాడు. ఇంతలో విజయ్ గురుమూర్తి హత్యకు గురైనట్లు, ఆ కేసు విచారణ కోర్టులో జరుగుతున్నట్లు చూపిస్తూ..ఈ కేసులో సత్య(విజయ్ మరో క్యారెక్టర్) అనే వ్యక్తిపై హంతకుడిగా అభియోగాలు మోపుతారు. కోర్టు దగ్గర పోలీస్ వాహనంలోంచి దిగిన ఆ వ్యక్తిని చూసి అందరూ బికిలీ అని అరుస్తూ ఉంటారు. మరోవైపు ఓ వ్యక్తిని చంపి ఎడారిలో పారేసినట్లు చూపించారు. ఓ చిన్న బాబు తన చెల్లితో కలిసి రోడ్డు మీద అడుక్కోవడం..ఆ బాబుని పోలీసులు తీసుకెళితే ఆ చిన్నారి పోలీస్ వాహం వెనుక పరిగెడుతూ కనిపిస్తుంది.

ఎన్నో ప్రశ్నలు
ఇంతకీ పోలీసులు ఆ పిల్లాడిని ఎందుకు తీసుకెళ్లారు?
విజయ్ గురుమూర్తి -సత్య ఇద్దరూ ఒక్కరేనా
వేర్వేరు క్యారెక్టర్స్ అయితే సత్య..విజయ్ ని ఎందుకు చంపాడు?
ఎడారిలో చంపిపడేసిన శవం ఎవరిది?
విజయ్ గురుమూర్తి పోలీస్ స్టేషన్ కి ఎందుకొచ్చాడు?
అయ్యప్ప మాలలో ఉన్నదెవరు?
ఇలా..ట్రైలర్ మొత్తాన్ని క్వశ్చన్స్ తో నింపేశాడు…అంటే ఆద్యంతం ప్రతి సీన్ ఆసక్తికరంగా మలిచారని అర్థం. కథ ఏంటన్నది క్లారిటీ రాకుండా ఆసక్తి తగ్గకుండా, బిచ్చగాడు ను మించి అనిపించేలా ట్రైలర్ వదిలారు. ట్రైలర్ మొత్తం రిచ్ లుక్ లో, అద్భుతమైన టేకింగ్ తో ఆకట్టుకుంటోంది.

బిచ్చగాడు లో బిచ్చగాడుగా కనిపించిన విజయ్…ఈ సినిమాలో అయ్యప్పమాల, చేతికి కడియంతో కనిపించిన లుక్ అదిరింది. అయితే పార్ట్ 1 లో తల్లిప్రాణాలు నిలిపేందుకు బిచ్చగాడుగా మారితే..పార్ట్ 2 లో మాత్రం బిచ్చగాడుగా మారిన గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాను మే 19వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమాకు హీరో, దర్శకుడు, నిర్మాత అన్నీ విజయ్ అంటోనీనే. బిచ్చగాడు మంచి విజయం అందుకోవడంతో బిచ్చగాడు 2 పైన కూడా అంచనాలు బాగానే ఉన్నాయి..తాజాగా విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేసిందంటున్నారు సినీ ప్రియులు.