ఏజెంట్ తో సూరి పని అయిపోయినట్లేనా.?

నవయువ సామ్రాట్, యంగ్ హీరో అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా రిలీజ్ అయ్యింది. ఇండస్ట్రీ సంగతి పక్కనపెడితే.. థియేటర్ల దగ్గర మాత్రం మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది యాక్షన్ సీక్వెన్సులు బాగున్నాయని అంటున్నారు కానీ ఓవరాల్ గా సినిమా బావుంది అని మాత్రం అనడం లేదు. దీంతో.. ఈ సినిమా కూడా అఖిల్ కెరీర్ కు పెద్దగా ఉపయోగపడేది కాదని స్పష్టంగా అర్థం అవుతుంది. అఖిల్ ది ఏముంది. ఇది కాకపోతే.. ఇంకో సినిమా చేస్తాడు. వెనుక దండిగా డబ్బులు పెట్టే నాన్న ఉన్నాడు. కానీ డైరెక్టర్ సురేందర్ రెడ్డి అలా కాదు. ఏజెంట్ తో హిట్ కొట్టాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు సిట్యువేషన్ కాస్త డిఫరెంట్ గా తయారైంది. ఏజెంట్ సినిమాకు వస్తున్న అతి పెద్ద నెగిటివ్ కామెంట్ దర్శకుడు సురేందర్ రెడ్డి గురించే.
అఖిల్ తో రూ.100 కోట్లు అవసరమా.?
అఖిల్ కు ఇంతవరకు సరైన హిట్ పడలేదు. అతని మార్కెట్ రూ.20 కోట్లు లోపే ఉంది. కానీ అలాంటి అఖిల్ ని హీరోగా పెట్టుకుని రూ.100 కోట్లు ఖర్చుపెట్టించాడు సూరి. డబ్బులు పెట్టేవాడు ఉంటే ఎంతైనా ఖర్చు పెట్టించడం అనేది మంచి పద్ధతి కాదు. గతంలో కిక్ 2 సినిమాకు కూడా ఇలాగే చేశాడు. సినిమా ట్రాక్ తప్పుతుంది, బడ్జెట్ పెరుగుతుంది అని రవితేజ చెప్పినా కూడా సూరి పట్టించుకోలేదు. కట్ చేస్తే మూవీ డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన సైరా కూడా కమర్షియల్ హిట్టేం కాదు. ఇప్పుడు ఏజెంట్ సినిమాకు కూడా డబ్బులు వెనక్కి వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి సిట్యువేషన్ లో రాబోయే రోజుల్లో ఏ నిర్మాత సురేందర్ రెడ్డిని నమ్మే పరిస్థితి ఉండదు. దీనికితోడు వరుస ఫ్లాపులతో ఇప్పుడు అతని దర్శకత్వంపైనే అనుమానాలు వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు.
అర్జెంట్ గా హిట్ కొట్టకపోతే కష్టమే
ఏజెంట్ సినిమా రిజల్ట్ ని చూసి అందరూ ఇప్పుడు దర్శకుడు సురేందర్ రెడ్డినే విమర్శిస్తున్నారు. ఈ విమర్శలకు సమాధానం చెప్పాలంటే అర్జెంట్ గా సినిమా తీసి హిట్ కొట్టాలి. ప్రతీ సినిమాకు మినిమం 3 ఏళ్లు గ్యాప్ తీసుకునే సురేందర్ రెడ్డి… వచ్చే ఏడాదిలోపు సినిమా తీసి హిట్ కొట్టి చూపించాలి. అప్పుడు అతను మళ్లీ ట్రాక్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. లేదు మళ్లీ పెద్ద బడ్జెట్, పెద్ద హీరో, మూడేళ్లు గ్యాప్ అంటే… టాప్ రేసులోంచి తనకు తెలీకుండానే తప్పుకున్నవాడు అవుతాడు.