పురాణాల్లో కేవలం దేవుడు, భక్తి గురించి మాత్రమే కాదు ఆరోగ్యం గురించి కూడా ఉంది. ఆహారానికి సంబంధించి కొన్ని నియమాలు పాటించడం ద్వారా అనారోగ్యం దరిచేరదని, ఔషధాలతో అస్సలు పనే ఉండదంటారు. ఇందులో చాలా నియమాలు ఇంట్లో పెద్దలు తరచూ చెబుతున్నవే.
ఇంతకీ ఏంటా ఆహార నియమాలు..పురాణాల్లో ఏముంది-యోగశాస్త్రం ఏం చెబుతోంది
పధ్యే సతి గదార్తస్య కి మౌషద నిషేవనై:
వినాపి భేశాజేవ్యర్ది : పత్యాదేవ్ నివర్తత
న తు పథ్య విహీనస్య భేశాజానాం శథైర్యపి
అంటే రోగికి ఔషధాల అవసరం లేకుండానే కేవలం నియమిత ఆహారం పాటించడం వలన వ్యాధులు దూరమవుతాయి . ఆహారంపై నియంత్రణ లేక పోతే అత్యుత్తమమైన మందులు కూడా ఫలితాన్ని ఇవ్వలేవని అర్ధం .
అన్నం బ్రహ్మా రసో విష్ణుః భోక్తా దేవో మహేశ్వరః
ఇతి సంచింత్య భుంజానః అన్నదోషై ర్న లిప్యతే
ఈ అన్నమే బ్రహ్మ…ఇందులోని సారమే విష్ణువు…దీనిని భుజించేవాడు సాక్షాత్తూ మహేశ్వరుడే…ఇలా భావించి భుజించేవారికి అన్నదోషము అంటదని అర్థం.
యోగశాస్త్రం ఏం చేబుతోందంటే
మనిషి శ్వాసగతి 12 అంగుళాల వరకూ ఉంటుంది. భోజనం చేసేటపుడు అది 20 అంగుళాలవుతుంది. మాట్లాడితే శ్వాసగతి మరింత పెరుగుతుంది .. ఆయుష్షు తగ్గుతుంది..అందుకే ఆహారం తినేటప్పుడు మాట్లాడకూడదని చెబుతారు.
రాత్రిపూట అన్నం తినేటపుడు కరెంటు పోతే…చీకట్లో తినకూడదు..అన్న పాత్రను పట్టుకుని సూర్యుడిని స్మరించాలి…మళ్లీ వెలుగు వచ్చిన తర్వాత తినాలి…ఆకులో, ప్లేటులో ఉన్నది పూర్తిచేయాలి కానీ మళ్లీ వడ్డించుకోరాదు
త్రయోదశినాడు వంకాయ తినకూడదు. అష్టమి రోజు కొబ్బరి తినకూడదు, పాడ్యమిరోజు గుమ్మడికాయ తినకూడదని, పురాణాలు చెబుతున్నాయి. దొండకాయ తింటే బుద్ధి నశిస్తుంది.
తుమ్మినప్పుడు…తలపై నీళ్ళు చల్లడం, ఎవరో ఒక దేవుడిని స్మరించాలంటారు పెద్దలు
రాత్రిపూట అన్నంలో పెరుగు వాడకూడదు..పంచదారతో కలిపి తీసుకోవచ్చు
చీకటి పడిన తర్వాత…. కాచిన పెరుగు (మజ్జిగపులుసు) తినకూడదు
నలుగురు కూర్చుని తింటూ ఉన్నప్పుడు మధ్యలో లేవకూడదు
ఆకలితో బాధపడేవారు కోడి, కుక్క చూస్తుండగా భోజనం చేయరాదు
ఎప్పుడూ నిర్ణీత సమయం లోనే భోజనం చెయ్యాలి .ఆహారం నెమ్మదిగా పూర్తిగా నమిలి తినాలి. అంటే నోటిలోనే సగం నమలడం వల్ల లాలాజలం పూర్తిగా కలిసి మింగడం సులువు అవుతుంది . పిండి పదార్ధాలు పూర్తిగా జీర్ణం అవుతాయి . కడుపులో ఊరే ఆమ్లాలకు లాలాజలం విరుగుడు గా పనిచేస్తుంది .
ఆవు మజ్జిగలో సైంధవలవణం కలిపితే వాతాన్ని పోగొడుతుంది, పంచదార కలిపితే పిత్తాన్ని పోగొడుతుందని, శొంఠికలిపితే కఫాన్ని పోగొడుతుంది
పురాణాల్లో అయినా యోగశాస్త్రంలో అయినా చెప్పేది ఒక్కటే…ఆహారాన్ని సమయానికి తీసుకోవాలి, మితంగా తినాలి..అప్పుడే ఆరోగ్యం.
నోట్: కొన్ని ఆధ్యాత్మిక గ్రంధాల్లో పేర్కొన్న వివరాలు, పండితుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రాసిన వివరాలివి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం