Boycott Beef: వందేళ్ల క్రితమే బీఫ్‌ను బాయ్‌కాట్ చేశారక్కడ, ఎంత పెద్ద ఉద్యమం జరిగిందంటే!

ఆవు మాంసాన్ని తినడం ఎంత అపవిత్రమో వందేళ్ల క్రితమే మయన్మార్ మహిళలు గుర్తించారు. అందుకే వందేళ్ల క్రితమే సరిగ్గా ఇదే రోజు ( ఏప్రిల్ 25) ఆవుమాంసం తినడం బాయ్ కాట్ చేశారు…ఇందుకోసం పెద్ద ఉద్యమమే చేశారు…

క్షీరసాగర మథనంలోంచి ఉద్భవించిన కామధేనువు
గోమాతలో సర్వదేవతలు కొలువై ఉంటారు…అందుకే గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుందని హిందూ పురాణాలు చెబపుతున్నాయి. అమృతం కోసం దేవతలు, రాక్ష‌సులు ఆదిశేషువు తాడుగా మంధ‌ర పర్వ‌తాన్ని క‌ర్ర‌గా చేసుకుని క్షీర సాగ‌రాన్ని మ‌థిస్తారు. ఆ క్షీర సాగ‌ర మ‌థ‌నంలోంచి ఉద్భవించినదే కామథేనువు. లోకంలో ఉన్న పశుసంపదకు ఈ కామధేనువే ఆధారం. అందుకే అత్యంత పవిత్రం అని పురాణాలు చెప్తాయి.

బీఫ్ తినొద్దంటూ వందేళ్ల క్రితమే ఉద్యమం
హిందువులకు ఆవు దైవంతో సమానం. ఆ ఆవును ఇష్టంగా తినేవారు ఉన్నారు. అందుకే ఆవు కొన్ని దేశాల్లో తీవ్ర ఘర్షణలకు కేంద్రబిందువుగా మారింది. ఆరోగ్యపరంగా కూడా గొడ్డు మాంసాన్ని (Beef) ను తినవద్దనే చెబుతారు ఆరోగ్యనిపుణులు. అయినా కూడా రోజూ ఎన్నో ఆవుల తలలు తెగుతూనే ఉన్నాయి. వందేళ్ల క్రితమే బర్మాలోని మహిళలు బీఫ్ ను తినవద్దని పెద్ద ఉద్యమమే చేశారు. గోమాంసాన్ని తినడాన్ని నిషేధించాలని బర్మాలోని క్యుక్లాన్ ప్రాంతంలో ఉన్న ‘బర్మా మహిళా సంఘం’ వాదించింది. ఇందుకోసం ఎంతో పోరాడారు.

కబేళా లైసెన్సులు దక్కించుకుని మరీ పోరాటం
బర్మాలో అప్పట్లో కబేళా లైసెన్సులను తీసుకోవాలి. అలా తీసుకున్నాక కబేళాలకు వచ్చే ఆవులను చంపి మాంసం రూపంలో విక్రయిస్తారు. ఈ మహిళా సంఘం ఏకంగా ఆ కబేళా లైసెన్సును దక్కించుకుంది. ఆ లైసెన్సును దక్కించుకున్నా కూడా గొడ్డు మాంసాన్ని విక్రయించే వారు కాదు. అలా అయినా ఆవులను కాపాడాలని వారి ప్రయత్నం. అయితే అక్కడ మాంసం విక్రయించకపోతే లైసెన్సులు రద్దు చేస్తామని ఇన్ ఛార్జి అధికారి హెచ్చరించాడు. దీంతో మహిళ సంఘం సభ్యులు పెద్ద ఉద్యమమే చేపట్టారు. బీఫ్ అమ్మేవారి నుంచి తామే అధిక ధరలకు కొనుగోలు చేశారు. కానీ వాటిని అమ్మకుండా పడేసేవారు. ఇలా చాలా రోజుల పాటూ ఉద్యమం సాగింది. చివరికి కబేళా, గొడ్డు మాంసం దుకాణాలు మూసేవరకూ వారి పోరాటం ఆగలేదు. చివరికి అక్కడ కబేళా, దుకాణాలు మూత పడ్డాయి.

పశువులను తింటే వ్యవసాయంపై ప్రభావం
బర్మాలో 1900ల కాలంలో లెడి సయర్డావ్ అనే బౌద్ధ సన్యాసి బర్మా ప్రజలను బీఫ్ తినొద్దని పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. బర్మా ప్రజల ఆర్ధిక వ్యవస్థ వ్యవసాయంపై ఆధారపడి ఉంటుంది. పశువులను తినడం వల్ల వ్యవసాయం దెబ్బతింటుంది. బర్మా రైతులు పశువులతో కలిసే బియ్యాన్ని పండిస్తారు. వాటి సాయంతోనే భూమిని తవ్వుతారు. అలాంటి పశువులను తినడం చాలా నేరమని ఆయన బర్మీయులకు వివరించాడు. ఆ తర్వాత 1956లో నాటికి బర్మా బౌద్ధమత రాజ్యంగా మారింది. అక్కడ పశువుల వధ చట్టాన్ని కఠినతరం చేశారు. ఈ చట్టం వల్ల అక్కడ ఎన్నో పశువులు ప్రాణాలు నిలుపుకోగలిగాయి. పశువులను చంపాలంటే అక్కడ కచ్చితంగా ముందస్తుగా అనుమతి తీసుకోవాలి..లేదంటే జైలు శిక్ష తప్పదు. అయితే ఈ చట్టాన్ని అక్కడ ముస్లింలు వ్యతిరేకించారు..