విరూపాక్షకు వసూళ్లే వసూళ్లు

కంటెంట్ చూసి, కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి అంటాడు ప్రభాస్. రీసెంట్ గా రిలీజైన విరూపాక్ష సినిమాకు అదే జరిగింది. సినిమాలో విషయం ఉంటే… ఆ సినిమా హిట్ అవ్వడాన్ని ఎవ్వరూ ఆపలేరనే విషయం మరోసారి ప్రూవ్ అయ్యింది. విరూపాక్ష సినిమా కేవలం మూడు రోజుల్లో అంటే ఫస్ట్ వీకెండ్ లోనే రూ.44 కోట్లు వసూలు చేసింది. ఈ ఫిగర్ ని సినిమా యూనిట్టే అఫీషియల్ గా రిలీజ్ చేసింది. దీనికితోడు సోమవారం నాడు కూడా విరూపాక్ష కలెక్షన్లలలో ఏమాత్రం డ్రాప్ కన్పించలేదు. దీంతో ఈ సినిమా సాయి ధరమ్ కెరీర్ లోనే హయ్యస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది విరూపాక్ష సినిమా.
మొదటి నుంచి లాభాలే
విరూపాక్ష సినిమా తక్కువ బడ్జెట్ లో తీశారు. ఉన్నది రెండు పాటలే. అవి కూడా లొకేషన్ లో తీసేశారు. సినిమా మొత్తం ఒక ఊరు దాటి బయటకు వెళ్లలేదు. అందుకోసం సెట్టింగ్ వేశారు. ఇక సాయి ధరమ్ తేజ్ తప్ప రెమ్యూనరేషన్ పరంగా ఎక్కువ తీసుకునే ఆర్టిస్టులు లేరు. దీంతో… ఎలా చూసినా కూడా విరూపాక్ష అనుకున్న బడ్జెట్ లోపే పూర్తయింది. ఈ సినిమాను టేబుల్ ప్రాఫిట్ కు అమ్మేశారు. అంటే నిర్మాతకు రిలీజ్ రోజే పెట్టిన పెట్టిన మొత్తం లాభంతో సహా వచ్చేసింది. ఇప్పుడు బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు వంతు. వాళ్లు పెట్టిన డబ్బులు మొదటి మూడు రోజుల్లోనే వచ్చేశాయి. సో… ఇక సోమవారం నుంచి వస్తున్నదంతా లాభాలే.
అందరి దృష్టి ఏజెంట్ పైనే
విరూపాక్ష సినిమాకు ఏ సినిమా పోటీకి లేకపోవడం కలిసొచ్చింది. సోలోగా థియేటర్లోకి వచ్చింది. కంటెంట్ కూడా ఆడియన్స్ కు నచ్చడంతో… అందరూ ఈ సినిమాకే వెళ్తున్నారు. దీనికితోడు సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇవ్వడంతో.. అసలు ఏ సర్టిఫికెట్ ఎందుకిచ్చారు అనే ఆశతో చిన్న, పెద్దా అందరూ థియేటర్లకు వెళ్తున్నారు. మరోవైపు సల్మాన్ ఖాన్ కిసి కా భాయ్-కిసి కి జాన్ సినమాకు డిజాస్టర్ టాక్ రావడంతో… అర్బన్ ఆడియన్స్ కూడా విరూపాక్షకే ఓటేశారు. మళ్లీ మరో సినిమా వచ్చేవరకు విరూపాక్షదే హవా. అయితే నెలాఖరకు ఏజెంట్ వస్తున్నాడు. ఈ సినిమాకు ఓపెనింగ్స్ వస్తాయి. హిట్ టాక్ వస్తే ఓకే. లేదంటే… ఆడియన్స్ మళ్లీ విరూపాక్షకే మొగ్గుచూపిస్తారు. దీంతో… విరూపాక్ష టీమ్ ఫుల్ హ్యాపీగా ఉంది. తేజు అయితే పండగ చేసుకుంటున్నాడు. విరూపాక్ష ఇచ్చిన కిక్ తో రాబోయే రోజుల్లో మరిన్ని బ్లాక్ బస్టర్స్ చేస్తానంటున్నాడు. పనిలో పనిగా విరూపాక్ష సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని ప్రకటించేశాడు.