తెలుగు సినిమా పరిథి పెరిగింది. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో మన హీరోలు సత్తా చూపిస్తున్నారు. ఇండియానే కాకుండా విదేశాల్లోనూ మన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దీంతో… సినిమాల తాలూకు బడ్జెట్ పెరిగింది. పనిలో పనిగా హీరోల రెమ్యూనరేషన్లు కూడా భారీ స్థాయిలో పెరిగాయి. అయితే.. గతంలో హీరో రెమ్యూనరేషన్ పెరిగినా కూడా హీరోయిన్లు తాలూకు రెమ్యూనరేషన్స్ తక్కువగానే ఉండేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా మారిపోయింది. హీరోయిన్లు కూడా ఒక్కో సినిమాకు దండిగా తీసుకుంటున్నారు
కియరా అద్వానీకి రూ.11 కోట్లు
మొదటి నుంచి మన తెలుగు హీరోలు నార్త్ హీరోయిన్ల వైపే మొగ్గుచూపుతారు. సౌత్ హీరోయిన్స్ తో పోలిస్తే నార్త్ హీరోయిన్స్ బావుంటారు. అవునన్నా కాదన్నా ఇది ఒప్పుకుని తీరాల్సిన నిజం. అయితే ఒకప్పుడు ముంబయి వెళ్లి కొత్త హీరోయిన్ ని తీసుకు వచ్చేవారు. కానీ ఇప్పుడు అలాకాదు. ఆల్ రెడీ టాప్ పొజిషన్ లో ఉన్న హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇక నార్త్ హీరోయిన్ల రెమ్యూనరేషన్ విషయానికి వస్తే… రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా కోసం కియరా అద్వాని రూ.11 కోట్లు వసూలు చేస్తుంది. ఆమెకున్న క్రేజే దీనికి కారణం. ఇక ఎన్టీఆర్-కొరటాల శివ సినిమా కోసం జాన్వీ కపూర్ రూ.5 కోట్లు తీసుకుంటుంది. ప్రభాస్ సినిమా కోసం దీపిక కూడా రూ.8 కోట్ల వరకు వసూలు చేస్తుంది. సాహో సినిమా కోసం శ్రద్ధా కపూర్ కి రూ.5 కోట్లు ఇచ్చారు. RRR సినిమా కోసం ఆలియా భట్ రూ.8 కోట్లు తీసుకుంది. ఇలా స్టార్ హీరోయిన్లు అంతా మన నిర్మాతల దగ్గర ముక్కుపిండీ మరీ వసూలు చేస్తున్నారు.
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనేది సామెత. కానీ హిందీ హీరోయిన్ల విషయానికి వస్తే… మేనిపై రంగు ఉండగానే మేడలు, మిద్దెలు కొనుక్కోవాలి అన్నట్లుగా తయారైంది పరిస్థితి. ఇప్పుడు మన సినిమా రేంజ్ పెరగడం, వసూళ్లు కూడా భారీ స్థాయిలో రావడంతో… మన నిర్మాతలు కూడా బాలీవుడ్ మార్కెట్ కోసం అక్కడి హీరోయిన్లను తీసుకుంటున్నారు. దీంతో… వాళ్లు కూడా అడిగినంత ఇస్తేనే వస్తాం, చేస్తాం అన్నట్లుగా తయారైంది పరిస్థిది.