ఉత్తరాది రాజకీయ ప్రజా ఉద్యమంగా ఇంతకాలం సరిపెట్టుకున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు దక్షిణాదిలో విస్తరించేందుకు అన్ని అనుకూలతలకు కనిపిస్తున్నాయి. కర్ణాటకలో అధికారం సుస్థిరం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్న కమలనాథులు, ఇతర దక్షిణాది రాష్ట్రాలపైనా ప్రత్యేక దృష్టి పెట్టారు. తెలంగాణలో పార్టీ పటిష్టం చేసేందుకు కేంద్రం హోంమంత్రి అమిత్ షా తనదైన వ్యూహాలను రచిస్తున్నారు. గాడ్స్ ఓన్ కంట్రీ అంటే దైవభూమిలో పార్టీకి నూతన జవసత్వాలు అందించేందుకు ప్రధాని మోదీ స్వయంగా రంగంలోకి దిగారు.
కొచ్చిలో జన ప్రభంజనం
ప్రధాని మోదీ రెండు రోజుల కేరళ పర్యటనకు విశేష జనాదరణ లభించింది. ఇంతకాలం యూడీఎఫ్, ఎల్డీఎఫ్ మధ్యే పోటీ ఉంటుందని భావించగా.. ఇప్పుడు కేరళలో ప్రతీ ప్రాంతానికి బీజేపీ దూసుకుపోతోంది.బీజేపీ కేడర్ కు మోదీ టూర్ బూస్ట్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. మోదీ రోడ్ షోకు విశేష స్పందన లభించింది. రోడ్డుకు ఇరువైపులా లక్షలాది మంది నిల్చుని పూలవాన కురిపించారు. మోదీ కారు దిగి దాదాపు రెండు కిలోమీటర్ల దూరం నడిచి అందరికీ చేతులు ఊపుతూ ఉత్సాహ పరిచారు. నిజానికి మోదీపై దాడి చేస్తామని కొన్ని ఉగ్రవాద సంస్థలు బెదిరింపు లేఖలు పంపాయి. మానవబాంబులు సిద్దంగా ఉన్నాయన్న హెచ్చరికలను సైతం మోదీ పట్టించుకోలేదు. జనంలో, జనంతోనే ఉంటానని మోదీ చెప్పకనే చెప్పేశారు. మోదీ యువమ్ 2023లో పాల్గొని యువతను ప్రోత్సహించారు, కేరళ ప్రభుత్వ తీరుపై వ్యూహాత్మక ఎలాంటి వ్యాఖ్యలు చేయని మోదీ.. గతంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలను మాత్రం తూర్పార పట్టారు. దేశాన్ని అవినీతిమయంగా మార్చారని, కుటుంబ పాలన తప్ప వాళ్లు సాధించిందేమీ లేదని ఆయన ఆరోపించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారానికి వచ్చిన తర్వాతే యువతకు అవకాశాలు పెరిగాయన్నారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థతో అందరికీ అవకాశాలు పెరిగాయన్నారు. కేరళ కూడా మోదీ ఒక వందే భారత్ రైలును ప్రారంభించారు.
కేరళలో పాగాకు ప్రయత్నాలు
గత కొద్ది నెలలుగా కేరళపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రజల బాగోగులపై తమకు ప్రత్యేక ఆసక్తి ఉందని చెప్పేందుకు అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రకటించింది. కేరళలో హిందువులతో దాదాపు సమానంగా ఉన్న క్రైస్తవులు, ముస్లింలను కూడా అక్కున చేర్చుకునే ప్రక్రియను ప్రారంభించింది. ప్రధాని మోదీ కూడా తన పర్యటనలో భాగంగా ఎనిమిది మంది బిషప్ లతో ప్రత్యేకంగా సమావేశమై కేరళ అభివృద్ధికి వారి సలహాలు పొందారు. మోదీ పర్యటనకు ముందే కేరళ బీజేపీ నేతలు స్నేహ యాత్ర పేరుతో రెండు వర్గాల నేతలను కలుస్తూ వచ్చారు, ఈస్టర్ రోజున క్రైస్తవులతోనూ, రంజాన్ నెలలో ముస్లిం పెద్దలతోనూ భేటీలు నిర్వహించి ఆయా వర్గాల కోసం బీజేపీ చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. కేరళ నూతన సంవత్సరారంభమైన విషు రోజున (ఏప్రిల్ 14) బీజేపీ నేతలను అల్పాహార విందుకు ఆహ్వానించారు..
ఎన్నికల్లో విజయానికి సానుకలతలు..
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక ఎమ్మెల్యేను కూడా గెలుచుకోలేకపోయింది. 11.30 ఓట్ల శాతం సాధించింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడుతో పోల్చుకుంటే ఈ ఓట్ షేర్ ఎక్కువేనని చెప్పాలి. కాకపోతే ఓట్ల విభజన కారణంగా ఆ పార్టీ లబ్ధి పొందలేక పోయింది. లోక్ సభ ఎన్నికల్లోనూ కేరళ నుంచి ఎవరూ గెలవలేదు. 2019 లోక్ సభ ఎన్నికల తర్వాత మాత్రం కేరళలో కమలం పార్టీ పుంజుకుంటోంది. కేరళ కాంగ్రెస్ బలహీన పడటం బీజేపీకి కలిసొచ్చే అంశంగా చెప్పాలి. పైగా కేరళ కాంగ్రెస్ కి చెందిన విక్టర్ థామస్ బీజేపీలో చేరడంతో ఆ పార్టీకి బలాన్నిచ్చింట్లయ్యింది. గతంలో ఆయన యూడీఎఫ్ కు పట్టణంతీట జిల్లా ఛైర్ పర్సన్ గా పనిచేశారు.