దేశప్రజలదరి మనసులకు దగ్గరైన చేరిన మన్‌ కీ బాత్ – 100వ ఎపిసోడ్ 100 కోట్ల మంది శ్రోతలు !

ఎంతో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన తరవాత ఇంకా రేడియో సందేశం ఏమిటి అన్న వారున్నారు. ఇలా రేడియోలో మాట్లాడకపోతే టీవీలో సందేశం ఇవ్వొచ్చుగా అనే వాళ్లు కూడా ఉన్నారు. కానీ ప్రధాని మోదీకి అత్యంత చురుకైన సమాచార సాధనం ఏదో స్పష్టంగా తెలుసు. అందరికీ చేరవ ఎలా కావాలో ఆయన కంటే బాగా ఎవరికీ తెలియదు. ఆ విషయం మన్ కీ బాత్ ద్వారా మరోసారి నిరూపితమయింది.

96 శాతం ప్రజలకు తెలిసిన మన్ కీ బాత్

ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం 100 కోట్ల శ్రోతలకు చేరింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనెజ్మెంట్ సర్వే ఈ విషయాన్ని తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నెలవారీ నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం గురించి జనాభాలో దాదాపు 96 శాతం ప్రజలకు తెలుసునని ఈ సర్వే తేల్చింది. ఐఐఎం రోహతక్ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెలుగు చూశాయి. ఐఐఎం రోహతక్ డైరెక్టర్ ధీరజ్ పి.శర్మ, ప్రసారభాతి సీఈఓ గౌరవ్ ద్వివేది లు ఈ విషయాన్ని మీడియాకు వివరించారు. 23 కోట్ల మంది ప్రజలు క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని వింటున్నారని వారు చెప్పారు. మరో 41 కోట్ల మంది మన్ కీ బాత్ కార్యక్రమాన్ని అప్పుడప్పుడూ వింటున్నారని వివరించారు.

ప్రజలతో భావోద్వేగ బంధం !

మన్ కీ బాత్ కార్యక్రమానికి అత్యంత జనాధారణ కలగడానికి గల కారణాలు ప్రధాని మోదీ రాజకీయాలకు అతీతంగా విభిన్న అంశాలను ప్రస్తావించడం. శ్రోతలతో భావోద్వేగ సంబంధాన్ని ఏర్పరచుకొన్నందునే మన్ కీ బాత్ ను ప్రజలు ఆదరిస్తున్నారు. ప్రతీ ఎపిసోడ్‌లో స్ఫూర్తి దాయకమైన వ్యక్తులను మోదీని ప్రస్తావిస్తారు. అభినందిస్తారు కూడా. మెజారిటీ ప్రజలు ప్రభుత్వాల పనితీరు గురించి మన్ కీ బాత్ ద్వారా తెలుసుకున్నారని ఐఐఎం అధ్యయనం తెలుపుతుంది. 73 శాతం ప్రజలు ప్రభుత్వం తీరుపై ఆశాజనకంగా ఉన్నారని ఈ రిపోర్టు తెలుపుతుంది. 58 శాతం శ్రోతలు తమ జీవన పరిస్థితులు మెరుగుపడినట్టుగా చెప్పారు 63శాతం ప్రజలు ప్రభుత్వం తీరుపై సానుకూలంగా ఉన్నారు. 60 శాతం ప్రజలు దేశ నిర్మాణం పనిచేయడానికి ఆసక్తిని చూపుతున్నారు.

ఐఐఎం విస్తృతమైన సర్వే

మన్ కీ బాత్ ను కేవలం రేడియోల్లో మాత్రమే వినడం లేు. 44.7 శాతం ప్రజలు టీవీల్లో ఈ కార్యక్రమాన్ని వింటున్నారు. 37.6 శాతం మొబైల్ లో ఈ కార్యక్రమాన్ని వింటున్నారని ఈ రిపోర్టు తెలిపింది. మొత్తం10003 మంది ఈ సర్వేలో పాల్గొన్నారని ఐఐఎం ప్రకటించింది. ఇందులో 60 శాతం పురుషులు, 40 శాతం మంది మహిళలున్నారు. అన్ని వర్గాల ప్రజలనూ ఈ మన్ కీ బాత్ ఆకట్టుకుంటోంది.