మార్గదర్శి విషయంలో రామోజీరావు తప్పు ఒప్పుకుంటే ఆదర్శం – జరగాల్సింది జరిగి తీరుతుందన్న ఉండవల్లి అరుణ్ కుమార్ !

మార్గదర్శి ఫైనాన్షియర్స్ విషయంలో రామోజీరావు తప్పు ఒప్పుకుని జరిమానా కడితే ఆదర్శంగా ఉంటుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ వ్యాఖ్యానించారు. మార్గదర్శి అంశంపై స్వర్ణాంధ్ర వేదిక ఆధ్వర్యంలో రామోజీరావు మార్గదర్శి అక్రమాలు- నిజానిజాలపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రసంగించారు. ఎన్టీఆర్ లాంటి వ్యక్తినే పదవీచ్యుతుడ్ని చేసిన రామోజీరావుపై పోరాటం జరుగుతోందన్నారు. మార్గదర్శిపై పోరాటం బేతాళ విక్రమార్క కథను తలపించేలా సాగుతోందన్నారు హెచ్‌యూఎఫ్ ద్వారా డిపాజిట్ల సేకరణ చట్టవిరుద్ధమని తెలిసినప్పటికీ సరైన యంత్రాంగం లేకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ విచారణకు వచ్చిందన్నారు. డిపాజిట్ల వివరాలు వెల్లడించకుండా 17 ఏళ్ల పాటు మార్గదర్శి నిరాకరించిందని తెలిపారు. ఇటీవల సుప్రీంకోర్టు డిపాజిట్ల వివరాలివ్వాలని మార్గదర్శికి ఆదేశాలిచ్చిందని.. మదుపరుల సొమ్మును అక్రమంగా తమ వద్ద ఉంచుకోవడం చట్టవ్యతిరేకం కాబట్టి, ఇది తప్పు అని చెబుతున్నామని ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టం చేశారు.

నలభై ఏళ్లుగా ఇదే చేస్తున్నా అంటూ రామోజీరావు అసంబద్ధమైన వాదన వినిపిస్తూ వచ్చారని… ఈనాడు కథనాలతో కోఆపరేటివ్ బ్యాంకులను మూతపడేలా చేశారని ఆరోపించారు. తనపై మార్గదర్శి చేత 50 లక్షల రూపాయలకు పరువునష్టం ద్వారా వేశారని.. మార్గదర్శికి రామోజీరావుతో సంబంధం లేదని అబద్ధాలు చెప్తుంటే అదేమని అడిగినవాళ్లు లేరన్నారు. టీడీపీ ప్రభత్వ అక్రమాలు ఈనాడుకు కనబడవు. రాష్ట్ర పునర్విభజన చట్టంపై కేసు వేస్తే, టీడీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు అఫిడవిట్ వేయలేదన్నారు. అఫిడవిట్ వేయకపోతే జగన్ కు, చంద్రబాబుకు తేడా ఉండదని మార్గదర్శి అంశంపై ప్రభుత్వం తరపున అఫిడవిట్ వేశారరని అన్నారు.

మార్గదర్శిలో తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకంగా అఫిడవిట్ వేస్తుందనే భయంతో తెలంగాణ ప్రభుత్వంపై, అక్కడి నూతన సచివాలయంపై ఈనాడులో పొగడ్తలు కురిపిస్తున్నారని ఉండవల్లి వ్యాఖ్యానించారు. చట్టం ముందు అందరూ సమానమే అనేది పచ్చి అబద్ధం. డబ్బులున్న వాళ్లకి చట్టం చుట్టంగా మారింది. రామోజీరావు దర్జాగా పడుకుంటే సీఐడీ వాళ్లు వెళ్లి స్టేట్మెంట్లు రాసుకోవాల్సివచ్చిందన్నారు. టీడీపీ, జనసేనలు మార్గదర్శికి, రామోజీరావుకు అనుకూలంగా స్టేట్మెంట్లిచ్చాయన్నారు. దురదృష్టవశాత్తు ఈనాడు గొప్ప పత్రికగా పేరొందింది. ఎన్నికల సమయంలో కూడా ఈనాడు అత్యంత సంకుచితంగా వ్యవహరించిందని విమర్శించారు.

రామోజీరావు అన్నింటికీ అతీతుడనే అంశాన్ని అరికట్టకపోతే, ప్రజల్లోకి తప్పుడు భావన వెళ్తుంది. తప్పు చేశామని ఒప్పుకుని, జరిమానా కడితే సరిపోతుందని చెప్తున్నా.. ఎంత దుష్ప్రచారం చేసినా జరగాల్సింది జరిగితీరుతుందన్నారు. ప్రముఖ స్థానంలో వున్న రామోజీరావు లాంటి వాళ్లు చేసిన పొరపాట్లను ఒప్పుకుంటే ఆదర్శవంతంగా ఉంటుందని సలహా ఇచ్చారు. తానేను ఆరోపణలు చేసిన తర్వాత కూడా, మార్గదర్శికి డిపాజిట్లు వెల్లువెత్తుతున్నాయని వాళ్లే ప్రచారం చేసుకున్నారని ఉండవల్లి గుర్తు చేశారు. డిపాజిట్లు తిరిగివ్వకపోతే ఫిర్యాదు చేస్తారు కదా అంటున్నారు.. నేను కంప్లైంట్ చేస్తే నువ్వు వైఎస్సార్ మనిషివని ఆరోపిస్తున్నారని వ్యాఖ్యానించారు.

సంబంధం లేని ఎర్రంనాయుడు లాంటి వ్యక్తులు ఫిర్యాదు చేస్తే జగన్ ఫై కేసులు పెట్టి నిర్బంధింధిస్తే, తనపై కేసులు పెట్టడానికి నేనెవరినని ఎలా ప్రశ్నిస్తారని ఉండవల్లి మండిడ్డారు చంద్రబాబు, రామోజీల క్విడ్ ప్రోకో వుంది కాబట్టి ఒకరికొకరు సహకరించుకుంటారు. అయితే, చార్టెడ్ అకౌంటెంట్లు సైతం రామోజీరావుకు అనుకూలంగా సమావేశాలు నిర్వహించుకోవడం దారుణమన్నారు. తెలుగుదేశం పార్టీ తరపున గానీ, ఏ ఇతర పార్టీ తరపున గానీ అధికార ప్రతినిధులుగా ఎవరిని పంపినా .. తన దగ్గర కొన్ని ప్రశ్నలున్నాయన్నారు. చిట్ ఫండ్ వ్యాపారం చేస్తూ తాను కంపెనీ యాక్ట్ ప్రకారం తమ కంపెనీ పనిచేస్తుందని చెప్పడం విడ్డూరమని.. స్పష్టం చేశారు. ఈ కేసు విషంయలో తనకెటువంటి రాజకీయ దురుద్దేశాలు లేవని ఉండవల్లి స్పష్టం చేశారు.

కొన్నాళ్లు జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయదల్చుకోలేదు. ఎందుకు విమర్శలు చేయవని విమర్శించేవారికి ఆ అర్హత లేదని స్పష్టం చేశారు. వైఎస్సార్ పేరుతో పార్టీ నడుపుతున్న జగన్మోహన్ రెడ్డికి ఈ కేసును ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందన్నారు. జగన్ ఈ విషయంలో ఇదే వేగాన్ని కొనసాగిస్తూ హేతుబద్ధమైన ముగింపును తీసుకురావాలన్నారు.