Chalaki Chanti: ఐసీయూలో ‘జబర్దస్త్’ కమెడియన్ చలాకీ చంటి, అసలేమైంది?

‘జబర్దస్త్’ కామెడీ షోతో స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులను నవ్వించిన చలాకీ చంటి శనివారం తీవ్ర అస్వస్థకు గురైనట్లు వార్తలొచ్చాయి. గుండెనొప్పితో బాధపడుతున్న చంటిని హైదరాబాదులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించినట్లు సమాచారం. ప్రస్తుతం చంటిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది..అయితే ఇందులో ఎంతవరకూ నిజం అనేది క్లారిటీ లేదు కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చంటి తొందరగా కోలుకొని ఎప్పటిలాగే తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించాలని పోస్టులు పెడుతున్నారు.

జబర్దస్త్ కమెడియన్, బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన చలాకీ చంటి కమెడియన్ గా తనకంటూ ఓప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.
‘జబర్దస్త్’ కామెడీ షోతో చంటీ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాల్లో అవకాశాలు రావడంతో మధ్యలో ‘జబర్దస్త్’ షోను విడిచిపెట్టినా.. అప్పుడప్పుడు కనిపించేవాడు. ఈటీవీ ప్లస్‌‌లో ప్రసారమైన ‘నా షో నా ఇష్టం’ షోకు యాంకర్‌గా వ్యవహరించాడు. గత ఏడాది టెలికాస్ట్ అయిన బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొన్న చంటి ప్రేక్షకుల నుంచి కూడా మంచి మార్కులు కొట్టేసినా..టాప్ 5 కి చేరుకోలేకపోయాడు. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత పెద్దగా బుల్లితెరపై కనిపించలేదు. అడపాదప షోలలో చేస్తూ ఉన్న చలాకీ చంటి పూర్తిగా స్క్రీన్ కు దూరం అవ్వడంతో దీంతో ఆయన అభిమానులు చలాకి చంటి కి ఏమైందో అంటూ కంగారుపడుతున్నారు. ఇలాంటి సమయంలోనే చలాకీ చంటి హాస్పిటల్లో చేరారని అని వార్త వినగానే ఆందోళన చెందుతున్నారు.

చలాకీ చంటి ఆరోగ్యం బాలేదని వచ్చిన వార్తలను మొదట్లో ఎవరూ నమ్మలేదు. అయితే ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సీరియస్ హార్ట్ స్ట్రోక్ తో ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం రావడంతో పాటూ…కండిషన్ ప్రస్తుతం సీరియస్ గానే ఉందని డాక్టర్లు చెప్పినట్లు తెలుస్తోంది. చిన్న వయసులో ఇలా ఆసుపత్రిలో చేరడం బాధ కలిగించే విషయం ఇది. ఇలా చలాకి చంటి ఆరోగ్యం గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ …కోలుకుని ఇంటికి తిరిగిరావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.