రంజాన్‌కు అలా – సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి ఇలా ! హిందువులకు వైసీపీ సర్కార్ క్షమాపణ చెప్పాలన్న బీజేపీ !

సింహాద్రి అప్పన్న చందనోత్సవం, నిజరూప దర్శనం కోసం భక్తులు ఎంత కష్టమైనా పడతారు. కానీ ప్రభుత్వం వారిని ఉద్దేశపూర్వకంగా కష్టపెడితే మాత్రం తట్టుకోవడం కష్టమే. ఇతర వర్గాల పండుగలకు ప్రభుత్వం ప్రజాధనం వెచ్చించి మరీ భారీ ఏర్పాట్లు చేస్తుంది. విందులు .. వినోదాలు ఏర్పాటు చేస్తుంది. కానీ భక్తుల సొమ్ముతో నిర్వహించే హిందూ దేవుళ్ల విశేష కార్యక్రమాల విషయంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తోంది. దానికి ప్రత్యక్ష సాక్ష్యం .. గుంటూరులో జరిగిన రంజావ్ వేడుకలు హాయిగా సాగడం.. విశాఖలో జరిగిన అప్పన్న చందనోత్సవం మాత్రం భక్తులకు చుక్కలు చూపించడం.

సింహాచల అప్పన్న చందనోత్సవం ఏర్పాట్లలో ప్రభుత్వం ఘోర వైఫల్యం

సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి వచ్చిన భక్తులకు అధికారులు నరకం చూపించారు. కొండ దిగువన కిలోమీటర్ వరకు ఆర్టీసీ బస్సుల్లో భక్తులు వేచి ఊండాల్సిన పరిస్థితి. గంటల తరబడి నిలిపివేయడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాు. కొండమీదకు గంటల తరబడి అనుమతి ఇవ్వకపోవడంతో చిన్న పిల్లలు, వృద్ధులతో వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలోను..దేవస్థానం అధికారులు వైఫల్యం చెందారు. ఇంత ఘోరం ఎప్పుడూ చూడలేదని… భక్తులు మండిపడుతున్నారు. కొండమీదకు పంపించాలని భక్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొండ కింద నుంచిపై వరకు రద్దీ ఉన్నా జవాబు చెప్పేవారు లేరని స్వయంగా విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర కూడా ప్రభుత్వంపై మండిపడ్డారు. తన జీవితంలో ఇలాంటి దౌర్భాగ్యం ఎప్పుడూ చూడలేదన్నారు. భక్తుల ఆర్తనాదాలు వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయన్నారు. భక్తుల ఇబ్బందుల మధ్య దైవదర్శనం బాధ కలిగించిందని, ఇలాంటి చందనోత్సవ నిర్వహణ ఎప్పుడూ జరగలేదని స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. ప్రభుత్వానికి మద్దతుగా ఉండే ఆయనే ఇంత ఆగ్రహానికి గురయ్యారంటే… మరి మిగతా వాల్ల పరిస్థితి ఏంటో చెప్పాల్సిన పని లేదు.

ప్రజాధనంతో ఇతర వర్గాల పండుగలకు మాత్రం ప్రణాళికా బద్దంగా వేడుకలు !

ప్రజాధనంతో ఇతర వర్గాల వేడుకలు, పండుగల్ని మాత్రం ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా నిర్వహిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలను ఆకట్టుకునేందుకు ప్రజాధనంతో ఇఫ్తార్ విందులు నిర్వహించారు. ఇలాంటి విందులకు ఎక్కడా ప్రణాళికా లోపం రాలేదు. గుంటూరులో రూ. ఇరవై లక్షల ప్రజాధనంతో విందు ఏర్పాటు చేశారు . అందర్ని గౌరవంగా పిలిచి మరీ ఈ విందులు నిర్వహించారు. కానీ భక్తుల సొమ్ముతో నిర్వహించే చందనోత్సవంవంటి వాటికి మాత్రం ఉద్దేశపూర్వకంగా గందరగోళం సష్టిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. చిత్తశుద్ధి లేని శివపూజ చేసినట్లే హిందూ వ్యవహారాల్లో ఏపీ ప్రభుత్వ తీరు ఉంటోందన్న విమర్శలు వస్తున్నాయి. అప్పన్న చందనోత్సవాన్ని ఇంత ప్రణాళికా రహితంగా నిర్వహించడం ఎప్పుడూ చూడలేదని భక్తులు అంటున్నారు. సామాన్య భక్తుల్ని కుట్ర పూరితంగా ఇబ్బంది పెట్టారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు తిరుమలకు వెళ్లాలంటేనే సామాన్య భక్తుడు ఖర్చులకు భయపడే పరిస్థితి తెస్తున్నారు .. మరో వైపు ఇతర ఆలయాల ఆర్థిక పరిస్థితిని కుంగదీస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
దేవాదాయ భూములు వేల ఎకరాలు అన్యాక్రాంతమైపోతున్నా పట్టింటుకోవడం లేదన్న వార్తలు రోజూ వస్తున్నయి.

హిందువులకు ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్న విష్ణువర్ధన్ రెడ్డి !

హిందు భక్తులు పవిత్ర హుండీ సొమ్ముతో ఆలయాల వద్ద భక్తులకు ఏర్పాట్లు చేయడానికి దేవాలయ శాఖకు వచ్చిన ఇబ్బంది ఏముందని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని.. సంఘటనలు యాదృచ్ఛికమా.. ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. భక్తులకు వైకాపా ప్రభుత్వం సమాధానం చెప్పమని ఏపీ బీజేపి డిమాండ్ చేస్తూందన్నారు. సింహాద్రి అప్పన్న చందనోత్సవం ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వ వైఫల్యం చెందింది. వైసీపీ ప్రభుత్వం సింహాద్రి అప్పన్న తో పాటు భక్తులు ఆగ్రహానికి గురి కాక తప్పదన్నారు. చూస్తూంటే ఇదంతా హిందువుల మనోభావాలు ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసే కుట్ర కనిపిస్తోంది. ఇప్పటికైనా మనసు మార్చుకుని హిందువుల మనోభావాలకు తగ్గట్లుగా వ్యవహరించకపోతే ఏపీ బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.