అమిత్ షా హెచ్చరికలతోనే అమృత్ పాల్ అరెస్టు…
ఖలీస్థానీ వేర్పాటుపాది, వారిస్ పంజాబ్ దే నాయకుడు అమృత్ పాల్ సింగ్ ను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇందిరాగాంధీ హయాంలో వేరాటువాద ఉద్యమ నేత జర్నైల్ సింగ్ భింద్రన్ వాలే స్వగ్రాంమమైన మెగా జిల్లా రోడే గురుద్వారాలో అతడ్ని అరెస్టు చేశారు. దీనితో నెలరోజులకు పైగా జరిగిన సెర్చ్ ఆపరేషన్ కు ఫుల్ స్టాప్ పడినట్లయ్యింది.
సరెండరా.. అరెస్టా..
అమృత్ పాల్ అరెస్టయ్యాడా. లొంగిపాయాడా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా కొనసాగుతోంది. ముందుగా ప్రకటించిన ప్రకారం అతను సరెండర్ అయ్యాడని తర్వాతే అదుపులోకి తీసుకుని అరెస్టు చూపిస్తున్నారని గురుద్వారాలోని జ్ఞానీ జస్బీర్ సింగ్ చెప్పిన దాని ప్రకారం పోలీసులకు అమృత్ పాల్ స్వయంగా ఫోన్ చేశాడు. ఆదివారం గురుద్వారాలో ప్రార్థనల అనంతరం ఉదయం ఏడు గంటలకు లొంగిపోనున్నట్లు వెల్లడించాడు. గురుద్వారాకు వచ్చిన అమృత్ పాల్ అక్కడి భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. వరుస సంఘటనలకు కారణాలను వివరించాడు. తర్వాత బయటకు వచ్చి లొంగిపోయాడన్నది ప్రత్యక్ష సాక్షుల కధనం. అతడి భార్య కిరణ్ దీప్ కౌర్ ను గురువారం అమృత్ సర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. బహుశా ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగానే అమృత్ పాల్ ను అదుపులోకి తీసుకున్నట్లు భావిస్తున్నారు.అతడ్ని పంజాబ్ లోని దిబ్రూఘర్ జైలుకు తరలిస్తారు.. ఇప్పటికే జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టయిన ఎనిమిది అమృత్ పాల్ ఎనిమిది మంది అనుచరులు అదే జైలులో ఉన్నారు.
దుబాయ్ టు పంజాబ్
అమృత్ పాల్ దుబాయ్ నగరంలో డ్రైవర్ ఉద్యోగం చేసేవాడని చెబుతున్నారు. అకస్మాత్తుగా ఖలీస్థానీ ఉద్యమాన్ని నెత్తికెత్తుకున్న అతను పంజాబ్ కు తిరిగొచ్చి వారిస్ పంజాబ్ దే ఉద్యమంలో చేరి దాని నాయకుడయ్యాడు. అతని అనుచరుడు లవ్ ప్రీత్ తుఫాన్ ను అరెస్టు తర్వాత ఫిబ్రవరి 23న అమృత్ పాల్ తన అనుచురులతో కలిసి అంజాలా పోలీస్ స్టేషన్ పై దాడి చేశాడు. బ్యారికెడ్లను ధ్వంసం చేయడంతో పాటు పోలీసులను కొట్టాడు. మరుసటి రోజే లవ్ ప్రీత్ విడుదలకు మెజిస్ట్రేట్ అనుమతించడంతో అతడితో కలిసి అమృత్ పాల్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించాడు. అమృత్ సర్ స్వర్ణదేవాలయం వరకు ఓపెన్ టాప్ జీపులో కత్తులు చూపించుకుంటూ వెళ్లాడు. తరచూ భారత వ్యతిరేక ఉపన్యాసాలు చేశాడు. ఫిబ్రవరి 26న అమృత్ పాల్ తీరును పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఖండిచారు. కేంద్ర ప్రభుత్వం కూడా వారిస్ పంజాబ్ దే ట్విటర్ ఖాతాను బ్లాక్ చేయించింది. మార్చి 19 నుంచి అమృత్ పాల్ అనుచరుల అరెస్టుల పర్వం మొదలైంది. వారిలో కొందరిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసులు పెట్టి అసోం జైలుకు తరలించారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న అమృత్ పాలు తొమ్మిది రాష్ట్రాలు తిరిగాడు. వేషం మార్చుతూ తప్పించుకున్నాడు. ఏప్రిల్ 18న అతను సరెండర్ అవుతాడని భావించినప్పటికీ ఆ పని జరగలేదు. ఎట్టకేలకు ఏప్రిల్ 23 ఉదయం పోలీసులకు చిక్కాడు..
మందలించిన కేంద్ర హోం మంత్రి
అమృత్ పాల్ విషయంలో పంజాబ్ ప్రభుత్వ ఉదాసీనతపై మొదటి నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. అతడ్ని అరెస్టు చేసేందుకు పంజాబ్ పోలీస్ చిత్తశుద్ధి చూపడం లేదని కొందరు విమర్శించారు. దీనితో కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. అమృత్ పాల్ అరెస్టు ఎప్పుడో జరగాల్సిందని , త్వరలోనే ఆ పని జరుగుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించిన 24 గంటల్లోనే అమృత్ పాల్ ను పంజాబ్ సర్కారు అదుపులోకీ తీసుకుంది. అమృత్ పాల్ కార్యకలాపాలకు అడ్డుకట్ట పడే తరుణం కూడా వచ్చిందని అమిత్ షా అన్నారు. అందులో అనిర్వచనీయమైన సందేశం కూడా ఉంది…