ఏపీ బీజేపీ నేతల కృషి – టీటీడీకి మినహాయింపు ఇచ్చిన కేంద్రం !

ప్రపంచంలో అతి పెద్ద ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమల తిరుపతి‌ దేవస్ధానాని కి కేంద్ర ప్రభుత్వం అరుదైన అవకాశం కల్పించింది. శ్రీవారికి భక్తుల సమర్పించే ఫారెన్ కరెన్సీని బ్యాంకులో డిపాజిట్ చేసుకునే విధంగా టిటిడికి కేంద్ర ప్రభుత్వం ఊరట నిచ్చింది. కానుకలు సమర్పించిన దాతల వివరాలు లేకపోయినా బ్యాంకుల్లో డిపాజిట్లు చేసుకునే విధంగా సెక్షన్ 50 నిబంధనలకు మేరకు టీటీడీకి మినహాయింపు కల్పించింది. దాతల వివరాలు లేకపోయినప్పటికీ భక్తులు స్వామి వారికి సమర్పించిన కానుకల వివరాలు పేర్కొనాలని సూచించింది. ఫారిన్ కరెన్సీ డిపాజిట్లకు కేంద్ర ప్రభుత్వం లైసెన్స్‌ను రెన్యువల్ చేసింది.

కలియుగ దైవం శ్రీనివాసుడిపై అపారమైన భక్తితో వారి వారి స్ధోమతలకు తగినట్లు వివిధ దేశాల నుండి వచ్చిన భక్తులు కానుకలు సమర్పిస్తూ ఉంటారు.. అయితే ఈ హుండి రూపంలో కొందరు పంపతే మరికొందరు నగదు రూపంలో కానుకలు సమర్పించి‌ మొక్కులు చెల్లించుకుంటారు. ఒక్క రూపాయి‌ నుండి కోట్ల రూపాయలు నగదు, బంగారు, వెండి, వివిధ విదేశీ కరెన్సీ నోట్లను శ్రీవారి దర్శనంతరం శ్రీవారి హుండీలో సమర్పిస్తూ‌ ఉంటారు. ఎవరు ఎంత నగదు వేశారో అనే వివరాలు ఎవరికీ తెలియదు.. స్ధోమతకు తగ్గట్టుగా హుండీ కానుకలు సమర్పించే సౌలభ్యం ఉండడంతో కానుకలు వేసి వెళ్ళి పోతుంటారు భక్తులు. ఇక ఈ హుండీలో సైతం ఎంతో మంది అజ్ఞాత భక్తులు, విదేశీ భక్తులు నగదును ట్రాన్సఫర్ చేస్తుంటారు. వీరి వివరాలు ఏమాత్రం టిటిడికి అసలు తెలియజేయరు. అయితే విదేశీ విరాళాలు ఎవరు ఇచ్చారో స్పష్టంగా తెలియాలనే నిబంధనలు ఉండటంతో టీటీడీకి ఇబ్బందికరంగా మారింది.

విదేశీ విరాళాలను స్టేట్ బ్యాంకు టీటీడీ ఖాతాలో జమ చేయడం లేదు. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని టిటిడి కేంద్ర ప్రభుత్వంకు లేఖ రాసింది. ఏపీ బీజేపీ నేతలు కూడా ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. అన్ని విషయాలను పరిశీలించిన కేంద్రం.. టీటీడీకి మినహాయింపు ఇచ్చేందుకు అంగీకిరంచింది. శ్రీవారికి భక్తులు సమర్పించే ఫారిన్ కరేన్సీని బ్యాంకులో డిఫాజిట్ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఫారిన్ కరేన్సి సమర్పించిన దాతలు వివరాలు లేకపోయినా బ్యాంకులో డిఫాజిట్ చేసుకునేందుకు టిటిడికి కేంద్ర ప్రభుత్వం మినహయింపు ఇచ్చింది. సెక్షన్ 50 నిబంధనల ప్రకారం టిటిడికి మాత్రమే ఇలాంటి మినహయింపు ఇస్తున్నట్లు టిటిడికి కేంద్ర హోంశాఖ కార్యదర్శి ముత్తుకుమార్ శుక్రవారం సమాచారం అందించారు.

టీటీడీ విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందించడంపై ఏపీ బీజేపీ నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. సానుకూల నిర్ణయం తీసుకున్న కేంద్రానికి ప్రధానమంత్రి ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.