మేష రాశి
ఈ రాశి ఉద్యోగులు అనవసర చర్చలకు దూరంగా ఉండాలి. పనిలో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. మీ శత్రువులు యాక్టివ్ గా ఉన్నారు మీరు అప్రమత్తంగా ఉండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తే ప్రశాంతత దొరుకుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తగ్గాలంటే ముందు మీరు మౌనంగా ఉండాలి. వ్యాపారులు ఈరోజు పడిన కష్టానికి భవిష్యత్ లో ప్రయోజనం పొందుతారు.
వృషభ రాశి
ఈ రాశివారిపై కుటుంబ సభ్యుల నుంచి కొంత వ్యతిరేకత ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు పెరుగుతాయి. అనుకున్న పనుల్లో ఆంటకాలు తప్పవు. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇది మంచి సమయం కాదు. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. మనసులో ప్రతికూల ఆలోచనలు ఉంటాయి. తొందపడి నిర్ణయాలు తీసుకోవద్దు..వాటివల్ల మీరు చాలా నష్టపోతారు. వాహనం జాగ్రత్తగా నడపాలి.
మిథున రాశి
మిథునరాశివారికి ఈ రోజు అదృష్టం కలిసొస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. స్నేహితులను కలుస్తారు. ఓ శుభవార్త వినే అవకాశం ఉంది. కొత్తగా ఏదైనా ప్రారంభించాలి అనుకుంటే ఈ రోజు మంచిరోజు. అవివాహితుల నిరీక్షణ ఫలిస్తుంది. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెడితే భవిష్యత్ లో లాభాలు పొందుతారు. ఉద్యోగులు పనితీరుతో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశివారు తలపెట్టిన పనలన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులు స్థిరమైన ఉద్యోగంలో స్థిరపడతారు. ఉద్యోగులకు శుభసమయం. వ్యాపారంలో లాభాలొస్తాయి. ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాల్లో మీరు లాభపడతారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఓ నిర్ణయం తీసుకునేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి..తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు.
సింహ రాశి
ఈ రోజు సింహరాశి వారు ప్లాన్ ప్రకారం పనులు పూర్తిచేస్తారు. లక్ష్యాన్ని సాధించేందుకు శ్రమిస్తారు. ఓ శుభవార్త వినే అవకాశం ఉంది. ప్రయాణం చేయాల్సి వస్తే జాగ్రత్త..వాహనం జాగ్రత్తగా నడపాలి. వ్యాపారులు, ఉద్యోగుల కు సాధారణ ఫలితాలున్నాయి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచన వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తారు.
కన్యా రాశి
ఈ రోజు మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది…సరదాగా మాట్లాడుతూనే మాటతూలే ప్రమాదం ఉంది. కుటుంబం మీ బలం. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. వైవాహిక జీవితం బావుంటుంది. మీకు శత్రులువు ఎక్కువమంది ఉన్నారు జాగ్రత్త. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఆదాయం బావుంటుంది..ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. వాహనం జాగ్రత్తగా నడపాలి.వ్యాపారులు నూతన పెట్టుబడులు ఇప్పుడు పెట్టొద్దు.
తులా రాశి
ఈ రాశివారు ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు మంచి సమయం. విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లాలనుకున్న విద్యార్థుల ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబానికి సమయం కేటాయించడం ద్వారా ఇంట్లో చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వ్యాపారం బాగానే ఉంటుంది.
వృశ్చిక రాశి
ఈ రాశివారు ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కార్యాలయంలో శత్రువులు ఎంత ఉత్సాహంగా ఉన్నా మీరు మీ పనితీరుతో చెక్ పెట్టేస్తారు. ఆర్థికపరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అవసరమైనంత వరకే ఖర్చులు చేస్తారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నవారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అప్పులు ఇవ్వడానికి, తీసుకోవడానికి దూరంగా ఉండాలి.
ధనుస్సు రాశి
ఈ రాశివారు కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. అనుకున్న పనులు పూర్తవకపోవడం మిమ్మల్ని నిరాశకు గురిచేస్తుంది. కోపం తగ్గించుకోవాలి..ప్రశాంతంగా ఆలోచించేందుకు ప్రయత్నిస్తే అడుగులు ముందుకు పడతాయి. కార్యాలయంలో వివాదాలకు దూరంగా ఉండాలి. పారిశ్రామిక వర్గాలవారికి మిశ్రమ ఫలితాలున్నాయి.
మకర రాశి
ఈ రాశివారిపై కుటుంబ సమస్యలు ప్రభావం చూపిస్తాయి. పని ఒత్తిడి పెరగడం వల్ల ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. స్నేహితుల కారణంగా నష్టపోతారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. ఉద్యోగులు కార్యాలయంలో వివాదాలకు దూరంగా ఉండాలి. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టేవారు నష్టపోతారు. వృత్తిపరమైన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా పని చేయండి.
కుంభ రాశి
ఈ రోజు ఈ రాశివారి మనసులో ఆందోళనలు తొలగిపోతాయి. రోజంతా సంతోషంగా ఉంటారు. కుటుంబ బంధాలు బలంగా ఉంటాయి. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.
మీన రాశి
ఈ రోజు ఈ రాశివారి ఆదాయం బాగున్నప్పటికీ ఖర్చులను అదుపుచేయాలి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి..వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రతికూల ఆలోచనలు చుట్టుముడతాయి. ఆహారాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. విద్యార్థులు కష్టపడితేనే ఫలితం సాధిస్తారు. మీ మాటతీరుతో ఎదుటివారిని బాధపెడతారు.
గమనిక: ఒక రాశిలో పేర్కొన్న ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ వ్యక్తిగత పూర్తి వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య శాస్త్ర పండితులను సంప్రదించగలరు. ఈ ఫలితాలను ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.