పవన్ కల్యాణ్ కంటే చిరంజీవే చాలా బెటర్

సినిమాల విషయంలో చిరంజీవి, పవన్ కల్యాణ్ ఇద్దరూ ఇద్దరే. ఇద్దరూ నాన్ స్టాప్ సినిమాలతో దూసుకుపోతున్నారు. మెగాస్టార్ ప్రస్తుతం మెహర్ రమేష్ తో భోళా శంకర్ చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత బింబిసార డైరెక్టర్ తో మూవీ కన్ ఫర్మ్ చేశాడు. అటు పవన్ కల్యాణ్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మొన్నటికి మొన్న వినోదయ శితం రీమేక్ మూవీని కంప్లీట్ చేశాడు. ఇప్పుడు హరీశ్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్ తో ఓజీని కంప్లీట్ చేస్తున్నాడు. అయితే కథల విషయంలో మాత్రం ఇద్దరికీ చాలా తేడా ఉంది. మెగాస్టార్ అన్నీ ఒరిజినల్ స్టోరీస్ ని పిక్ చేసుకుంటుంటే… పవన్ మాత్రం రీమేక సినిమాలపై ఆధారపడుతున్నాడు.
ఇక నుంచి అన్నీ ఒరిజినల్ కథలే – మెగాస్టార్
ఖైదీ నెంబర్ 150తో ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన చిరంజీవి.. ఆ తర్వాత సైరా, ఆచార్య, గాడ్ ఫాదర్ మూవీస్ చేశారు. ఇందులో ఖైదీ నెంబర్ 150, గాడ్ ఫాదర్ రెండూ రీమేక్ మూవీసే. ఖైదీ నెంబర్ 150 అయితే రీ ఎంట్రీకి బాగుంటుందని మెగాస్టార్ ఎంచుకున్నారు. కానీ గాడ్ ఫాదర మూవీ మాత్రం సగటు మెగా అభిమానికి కూడా నచ్చలేదు. అప్పటికే మలాయళ లూసిఫర్ ని అందరూ చూసేశారు. అందరూ చూసేసిన తర్వాత గాడ్ ఫాదర్ పై అభిమానులకు కూడా ఆసక్తి పోయింది. దీంతో… ఇకనుంచి రీమేక్ సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు మెగాస్టార్ చిరంజవి.
పవన్ మాత్రం ఇంకా రీమేకులే
అన్నయ్య మెగాస్టార్ అద్బుతమైన డెసిషన్ తీసుకుని ఇండస్ట్రీలో కొత్త దర్శకుల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ పవన్ మాత్రం ఇంకా రీమేకులపైనే ఆధారపడుతున్నారు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ రెండూ రీమేకులే. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటిస్తున్న వినోదాయ శితం కూడా ఓ రీమేక్ మూవీనే. ఇక హరీశ్ శంకర్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా తమిళ తేరి సినిమాకు రీమేక్ అని ప్రచారం నడుస్తుంది. దీంతో.. పవన్ అభిమానులు డీలా పడిపోతున్నారు. ఇలా రీమేకులు చేసుకుంటూ పోతే.. హిట్స్ వస్తున్నాయి కానీ బ్లాక్ బస్టర్స్ రావడం లేదని ఫీలవుతున్నారు. దీంతో.. ఇప్పటికైనా రీమేకులు మానేసి అన్నయ్య బాటలో ఒరిజినల్ కథలతో సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.