మేష రాశి
ఈ రాశివారిని ఈరోజంతా ఏదో ఆందోళన వెంటాడుతుంది. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. మీరు మీపనిలో మాత్రమే బిజీగా ఉండడం మంచిది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. భూములు, ఆస్తులకుసంబంధించిన వ్యవాహారాలకు ఈ రోజు దూరం పాటించాలి.అనవసర వ్యక్తులకోసం మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఆదాయం బావుంటుంది. వ్యాపారంపై మరింత దృష్టిసారిస్తే లాభాలు పొందుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
వృషభ రాశి
ఈ రాశివారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబం, స్నేహితులతో సంతోష సమయం గడుపుతారు.కొత్తవ్యక్తుల పరిచయం మీపనిని సులభతరం చేస్తుంది. ఉద్యోగులు సకాలంలో పనులు పూర్తిచేస్తారు. వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది.
మిథున రాశి
ఈ రాశివారికి ఈరోజు మంచిరోజు. కార్యాలయంలో తోటి ఉద్యోగులు, అధికారులతో సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. ఈ రోజు శుభదినం అవుతుంది. సామాజికంగా మీ హోదా, గౌరవం పెరుగుతాయి. రాజకీయ నాయకులకు పదోన్నతి అవకాశాలున్నాయి. బంధువుల నుంచి బహుమతులు అందుతాయి. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. మనసు ఆనందంగా ఉంటుంది.
కర్కాటక రాశి
ఈ రోజు మీకు సాధారణ రోజు. ప్రతి పని సులభంగా పూర్తవుతుంది. ఉద్యోగంలో ఉన్నతాధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. ప్రమోషన్ సమాచారం అందుకోవచ్చు. అధికారులతో కీలక అంశాలపై చర్చిస్తారు. కుటుంబ సభ్యులతో ఏదో ఒక చర్చ ఉంటుంది. మీరు కొత్త పనులు చేస్తారు. మీ ప్రవర్తన చూసి చాలా మంది ఇంప్రెస్ అవుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
సింహ రాశి
మీ రోజు లాభదాయకంగా ఉంటుంది. కేవలం మీ పని మీద దృష్టి పెట్టండి. శుభ కార్యాలలో పాల్గొంటారు. ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. మానసిక ఆందోళన ఉంటుంది. ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. వ్యాపారంలో ఆటంకాలు ఏర్పడవచ్చు. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది మాటతూలకండి.
కన్యా రాశి
ఈ రోజు మీకు శుభప్రదంగా ఉంటుంది. ఏదో ఒక పనిలో కీర్తి పొందుతారు. మిత్రుల నుంచి మంచి సమాచారం అందుతుంది. ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు మంచి అవకాశాలు పొందుతారు. మీ పరిచయాలు మీకు చాలా ఉపయోగపడతాయి. నూతన వస్త్రాలు, నగలు కొనుగోలు చేస్తారు. మీ బలహీనతలను ఎవ్వరి వద్దా బహిర్గతం చేయవద్దు..మీరే నష్టపోతారు
తులా రాశి
ఈరోజు మీరు సన్నిహితులను కలుస్తారు. రోజంతా బావుంటుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. మీరు మీ పనిని సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి లాభదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులు ఉద్యోగం సాధిస్తారు. ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. భార్యాభర్తల మధ్య అనుబంధం బలంగా ఉంటుంది. మాటపై సంయమనం పాటించండి. ఖర్చులను నియంత్రించండి.
వృశ్చిక రాశి
ఈ రాశివారికి ఈ రోజంతా గందరగోళంగా ఉంటుంది. చర్చలకు దూరంగా ఉండండి. అత్యవసరం అయితేకానీ ప్రయాణం చేయకపోవడమే మంచిది. ఆర్థికపరమైన ఆందోళన ఉంటుంది. విద్యార్థుల్లో ఉత్సాహం పెరుగుతుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే ఆలోచనను విరమించుకోవడం మంచిది. భవిష్యత్ ఆర్థిక ప్రణాళికలను రూపొందించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది.
ధనుస్సు రాశి
ఈ రోజు ఈ రాశివారిలో ఉత్సాహం లోపిస్తుంది. కుటుంబ కలహాలు అలాగే ఉంటాయి. న్యాయపరమైన విషయాల్లో అడ్డంకులు ఎదురుకావచ్చు. ఆస్తికి సంబంధించిన డాక్యుమెంటరీ డీడ్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి. వివాదాలకు దూరంగా ఉండండి.పిల్లల నుంచి మీపై వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. కష్టసమయాన్ని ఓర్పుగా ఎదుర్కోవాలి
మకర రాశి
స్నేహితులు , కుటుంబ సభ్యులతో రోజంతా ఉత్సాహంగా గడిచిపోతుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆస్తుల వ్యవహారాలు ముందుకు సాగుతాయి..వివాదాల్లో ఉన్న ఆస్తికి సంబంధించి ఫలితం మీకు అనుకూలంగా వస్తుంది. ఉద్యోగులు, వ్యాపారులకు ఇబ్బందులు తొలగిపోతాయి. శత్రువులపై మీరు పైచేయి సాధిస్తారు. ఆరోగ్యం బావుంటుంది. ఆర్థిక లాభం ఉంటుంది.
కుంభ రాశి
ఈ రాశివారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో డైలమాకు గురవుతారు. ఏదో గందరగోళం వీరిని వెంటాడుతుంది. ఆదాయం బాగానే ఉంటుంది కానీ అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి. మాటపై సంయమనం పాటించండి. కుటుంబ సభ్యులతో వివాదాలను కూర్చుని పరిష్కరించుకోవడం మంచిది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెడితేనే మంచి ఫలితాలు సాధిస్తారు.
మీన రాశి
ఈ రాశివారికి రోజంతా ఉత్సాహం అలాగే ఉంటుంది. కొత్త పనిని ప్రారంభించేందుకు ఈ రోజు మంచి రోజు. కుటుంబంతో, సన్నిహితులతో సంతోష సమయం గడుపుతారు. ఖర్చులు కొంతవరకూ అదుపుచేయగలుగుతారు. ఉద్యోగులకు మంచి సమయం. ఎవరి పనుల్లో జోక్యం చేసుకోకండి. కోపం తగ్గించుకోవడం మీ ఆరోగ్యానికి మంచిది.
గమనిక: ఒక రాశిలో పేర్కొన్న ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ వ్యక్తిగత పూర్తి వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య శాస్త్ర పండితులను సంప్రదించగలరు. ఈ ఫలితాలను ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.