దటీజ్ కర్ణాటక బీజేపీ – పార్టీ ఫస్ట్.. లీడర్స్ నెక్ట్స్ !

కర్ణాటక బీజేపీలో ముసలం అని .. టిక్కెట్లు దక్కని పార్టీ నేతలు రాజీనామాలు చేస్తున్నారని మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. కానీ బీజేపీ గురించి .. బీజేపీ వ్యూహాల గురించి పూర్తిగా తెలియని రాతలే ఇవని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. ఇందులో రెండు పాయింట్లు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒకటి.. ఎంతటి సీనియర్ నేతలైనా పార్టీ ఆదేశాల ప్రకారం .. పార్టీ పెట్టుకున్న నిబంధనల ప్రకారం ఉండాల్సిందే. వారికి ప్రత్యేక మినహాయింపులు ఉండవు. రెండు టిక్కెట్లు దక్కలేదని పార్టీ ఫిరాయించే నేతలను అసలు బీజేపీ ఎప్పుడూ పరిగణనలోకి తీసుకోదు. కర్ణాటక బీజేపీ చాలా వ్యూహాత్మకంగా తమ అభ్యర్థులను ఎంపిక చేసుకుంటోంది. పార్టీ క్యాడర్‌కు నేతలతో పాటు ప్రజలకూ స్పష్టమైన సంకేతం పంపుతోంది.

బీజేపీలో రూల్స్ ఎవరికైనా ఒక్కటే !

బీజేపీలో రూల్స్ అంటే రూల్స్. ఎవరికైనా ఒకటే. కింది స్థాయి నుంచి యడ్యూరప్ప వరకూ సేమ్ టు సేమ్. కర్ణాటక బీజేపీలో సుదీర్ఘ కాలంగా ఉన్న నేతల్ని ధైర్యంగా పక్కన పెడుతోంది. వారు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని బెదిరిస్తున్నా వెనక్కి తగ్గడం లేదు. యడ్యూరప్పను కూడా వయసు నిబంధన కారణంగా పక్కన పెట్టారు. మరో సీఎం జగదీష్ శెట్టర్ కు కూడా ఈ సారి టిక్కెట్ నిరాకరిస్తున్నారు. ఈ కారణంగా ఒక్క సారిగా అసంతృప్తి వెల్లువెత్తుతోంది. ఒకసారి, రెండుసార్లు ఎమ్మెల్యేలుగా పని చేసినవారు అసంతృ ప్తి వ్యక్తం చేయడం సహజం.ఆరుసార్లు ఎమ్మెల్యేగా నూ, ఒకసారి ముఖ్యమంత్రిగానూ వ్యవహరించిన సీనియర్‌ నాయకుడు జగదీష్‌ షెట్టార్‌ ఒక్కసారిగా మారిపోయారు. టిక్కెట్ ఇవ్వలేదని కాంగ్రెస్‌లో చేరిపోయారు. అయితే బీజేపీ మాత్రం లైట్ తీసుకుంది. ఇలా పార్టీలు మారే వారు మారిపోవచ్చని.. కానీ మశ్సీ ఇరవై ఏళ్ల వరకూ పార్టీలో చేర్చుకునే అవకాశం లేదని స్పష్టం చేస్తోంది.

యువనాయకత్వానికి బలం ఇస్తున్న బీజేపీ !

పార్టీని దశాబ్దాలుగా నమ్ముకున్న వారికి ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పిస్తారు కానీ నిత్యం ప్రజల్లో ఉండాల్సిన ఎమ్మెల్యేల విషయంలో మాత్రం బీజేపీ హైకమాండ్ చాలా పక్కాగా వ్యవహరిస్తోంది. యువనేతల్ని.. చురుకుగా ఉండే వారిని ప్రజా సమస్యలు పరిష్కిరంచే వారినే ఎంపిక చేసుకుంటోంది. . బీజేపీ ఈ సారి ఎక్కువ మంది కొత్త వారిని నియమించాలని నిర్ణయం కేంద్ర నాయకత్వం కూడా నిర్ణయం తీసుకుంది. కేంద్ర నాయకత్వం ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటోంది. పాతకుపోయిన సీనియర్లపై ప్రజల్లో అభిప్రాయం మారడంతో కొత్త నేతలకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇండిపెం డెంట్లుగా పోటీ చేస్తామని ప్రకటించినా వెనక్కి తగ్గడం లేదు. పార్టీ అభ్యర్థులను ఎంపిక చేయడంలో ప్రధాన మంత్రి మోడీ కూడా స్వయంగా దృష్టి పెట్టినట్లుగా చెబుతున్నారు

బుజ్జగింపులు ఉండవు.. పార్టీనే ఫైనల్ !

టిక్కెట్ రాలేదని.. లేకపోతే మరొకటని బీజేపీని బెదిరించడం అంటే… తమ రాజకీయ భవిష్యత్ ను బలి పెట్టుకున్నట్లేనని కర్ణాటక బీజేపీ నేతలకు తెలుసు. అందుకే వారు టిక్కెట్ కోసం హైకమాండ్ పై ఒత్తిడి తేవడానికి ప్రయత్నిస్తున్నారు కుదిరితే సరి.. లేకపోతే వెంటనే పార్టీకే మద్దతు ప్రకటిస్తున్నారు. కొంత మందిని మాత్రం ఇతర పార్టీలు టిక్కెట్లు ఆశచూపి చేర్చుకుంటున్నాయి. బీజేపీలోచెల్లని రూపాయిల్ని ఇతర పార్టీలు కళ్లకు అద్దుకుని తీసుకుంటున్నాయన్నమాట. అలాంటి వారి వల్ల బీజేపీకి ఎంత లాభం జరుగుతుందో ఎన్నికల ఫలితాల తర్వాత క్లారిటీ వచ్చే చాన్స్ ఉంది.