నిన్న షింజో అబే.. నేను ఫుమియో కిషిడా.. ఇద్దరిపై హత్యాయత్నం జరిగింది. దుండగుడి కాల్పుల్లో షింజో అబే చనిపోయారు. కిషిడా తృటిలో తప్పించుకున్నారు..
జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా…వకయామా ఓడరేవు దగ్గర జరిగిన ఒక సభలో ప్రసంగిస్తున్నప్పుడు దుండగుడు ఆయనపై బాంబు విసిరాడు.. బాంబ్ కొంచెం దూరంలో పడటంతో ప్రధానికి ప్రాణాపాయం తప్పింది. వెంటనే పోలీసులు సదరు దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. భద్రతా అధికారులు, ప్రధాని కిషిదాను అక్కడ నుంచి తీసుకెళ్లిపోయారు. బహిరంగ సభ వాయిదా పడింది.
ఈ సంఘటనపై నోరు మెదిపేందుకు అధికారులు సుముఖంగా లేరు. అయితే సంఘటన జరిగిన చోట సీసీ ఫుటేజీలో మాత్రం దుండగుడిని అరెస్టు చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. భయంతో జనం పరుగులు తీయడం కూడా కనిపించింది..
2022 జూలైలో అప్పటి జపాన్ ప్రధాని షింజో అబే హత్యకు గురయ్యారు. కరియుజావా నగరంలో జరిగిన ఒక బహిరంగ సభలో అబే ప్రసంగిస్తున్నప్పుడు ఒక దుండగుడు దగ్గర నుంచి కాల్పులు జరిపాడు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే అేబ మరణించారు. అయితే జపాన్ ప్రధానమంత్రులపై వరుస హత్యాప్రయత్నాలు ఎందుకు జరుగుతున్నాయనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న….