హైదరాబాద్ః మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎంపీ అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసు విచారణకు సంబధించిన వివరాలు ఇచ్చేలా సీబీఐని ఆదేశించాలని తన పిటిషన్ లో కోరారు. ఈ కేసులో చివరిసారిగా అవినాశ్ రెడ్డిని సీబీఐ గత నెల 14న హైదరాబాదులో విచారించింది. ఆ విచారణకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డులు సమర్పించేలా సీబీఐని ఆదేశించాలని ఎంపీ అవినాశ్ రెడ్డి తన మధ్యంతర పిటిషన్ లో కోర్టును కోరారు.
Related Posts
చంద్రబాబు ప్రభుత్వంలో బీజేపీ, జనసేన ఉంటాయా ?
ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా ఉన్నాయి. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు. మరి కూటమిగా పోటీ చేసిన జనసేన, బీజేపీ ప్రభుత్వంలో చేరుతాయా లేకపోతే.. బయట నుంచి…
బీజేపీ కూటమిలోకి వచ్చినప్పుడే విజయం – ఏపీ ఫలితాలు చెప్పింది ఇదే
చంద్రబాబుకు ఒంటరిగా గెలిచిన రికార్డే లేదు.. ఈ సారి ఆయన ఘోరంగా ఓడిపోతారు అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2019 ఎన్నికల సమయంలో ఏపీలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో…
పథకాల కన్నా ఎక్కువ నష్టం చేసింది అధికార దుర్వినియోగమే – ఆ తప్పును గుర్తించలేకపోయిన వైసీపీ !
2019లో 151 సీట్లు 50 శాతం ఓట్లతో తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలోనే ప్రజావిశ్వాసం కోల్పోయారు. పది శాతానికిపైగా ఓట్లను కోల్పోయారు. అధికారాన్ని…