ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్‌ను విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో ఏయే నెలల్లో పథకాలు అమలు చేయబోయే
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘ప్రభుత్వ సంక్షేమ పథకాల క్యాలెండర్ 2023–24’ను ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సమాచార శాఖ కమిషనర్ తుమ్మా విజయ్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏడాది పొడవునా క్యాలెండర్ ప్రకారం సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదే అన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 45 నెలల్లోనే సంక్షేమ పథకాల (డీబీటీ, నాన్ డీబీటీ) ద్వారా రూ. 2,96,148.09 కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేశారని చెప్పారు.