AP MLC Result 2023: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నిక ఏదైనా ఫలితం అదే వస్తోంది. ఆ బరిలో అధికార వైసీపీ (YCP) ఉంటే.. వార్ వన్ సైడ్ అవుతోంది. తాజాగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Local Body MLC Elections) వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. పోటీ జరిగిన అన్ని చోట్ల వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు ఘన విజయం సొంతం చేసుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో బలం లేకపోయినా పోటీలో నిలిచిన టీడీపీ (TDP) కి మరోసారి భంగపాటు తప్పలేదు. పశ్చిమ గోదావరి (West Godavari District) స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాథ్ గెలుపొందారు. కవురు శ్రీనివాస్‌కు 481 ఓట్లు రాగా, వంకా రవీంద్రనాథ్‌కు 460 ఓట్లు వచ్చాయి.
ఇక కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్ఆర్ సీపీ గ్రాండ్ విక్టరీ కొట్టింది. పార్టీ అభ్యర్థి డాక్టర్ మధుసూదన్‌రావు ఘన విజయం సాధించారు. మరోవైపు శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి నర్తు రామారావు ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థికి 636 ఓట్లు రాగా.. టీడీపీ మద్దతు ఇచ్చిన ఇండిపెండెంట్ అభ్యర్థికి 108 ఓట్లే మాత్రమే వచ్చాయి.
మార్చి13న ఏపీ వ్యాప్తంగా మొత్తం 9 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఆ ఓట్ల లెక్కింపు ఇవాళ కొనసాగుతోంది. అందులో మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ, నాలుగు స్థానిక సంస్థల నియోజకవర్గాలకు పోటీ పడుతున్న 139 మంది అభ్యర్థుల్లో కొందరి భవితవ్యం ఇప్పటికే తేలిపోగా.. మిగిలన వారు తమ లక్ ను పరిశీలించుకుంటున్నారు.