BJP-TDP: టీడీపీ బీజేపీ పొత్తులో మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక.. కూటమిని అభినందించిన జేపీ నడ్డా

BJP-TDP: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) పొత్తులు ఎలా ఉంటాయి అన్నదానిపై ఆసక్తి నెలకొంది.. వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party), జనసేన (Janasena) కలిసి పోటీ చేస్తాయన్నది దాదాపు ఫిక్స్ అయినట్టే.. ఇదే విషయాన్ని తాజాగా జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దానిపై క్లారిటీ ఇచ్చారు కూడా.. ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నా.. వారితో కలిసి వెళ్లేందుకు పవన్ అంత ఆసక్తి చూపించడం లేదని.. అందుకు ఏపీ బీజేపీ నేతల తీరే కారణమని పరోక్షంగా పవన్ తేల్చి చెప్పేశారు. అయితే టీడీపీతో కలిసి వెళ్లేందుకు బీజేపీ ఒప్పుకుంటే.. అప్పుడు మూడు పార్టీల కూటమి వచ్చే ఎన్నికల బరిలో ఉండే అవకాశం ఉండొచ్చు. అయితే ఏపీ బీజేపీ నేతలు మాత్రం.. టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. చంద్రబాబు నాయుడుతో పొత్తు అంటే..? జాతీయ నాయకులకు అస్సలు ఇష్టం లేదని చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు కలిసేందుకు ఎన్ని ప్రయాత్నాలు చేసినా.. తాము మాత్రం టీడీపీతో కలిసి వెళ్లే ప్రసక్తే లేదని పదే పదే చెబుతున్నారు బీజేపీ నేతలు.. అందుకు విరుద్ధంగా బీజేపీ – టీడీపీ పొత్తుతో మున్సిపల్ చైర్మన్ సీటు కైవలం చేసుకున్న సంగతి తెలిసి అంతా షాక్ అవుతున్నారు.

ఇంతకీ ఆ పొత్తులు ఎక్కడంటే..? గతేడాది అండమాన్ నికోబార్ దీవుల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది 2 స్థానాలే అయినా పోర్టుబ్లెయిర్ మున్సిపల్ కౌన్సిల్ ఏర్పాటులో కీలకంగా మారింది. ఆ ఎన్నికల్లో బీజేపీకి 10 స్థానాలు దక్కగా కాంగ్రెస్ కూటమి 11 స్థానాలు గెలిచింది. దాంతో టీడీపీ మద్దతుతో బీజేపీ కౌన్సిల్ పీఠాన్ని అధిష్ఠించింది.