Viveka Murder Case: అన్నింటికి సిద్ధంగా ఉన్నా.. అరెస్టు చేసుకుంటే చేసుకోండి.. భాస్కర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

వైఎస్ వివేకా హత్య కేసులో ఊహించని మలుపు తిరిగేలా కనిపిస్తోంది. మొన్నటివరకు కడప ఎంపీ అవినాష్ ఫోకస్ పెట్టిన సీబీఐ ఇప్పుడు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిపై దృష్టి సారించింది.

వైఎస్ వివేకా హత్య కేసులో ఊహించని మలుపు తిరిగేలా కనిపిస్తోంది. మొన్నటివరకు కడప ఎంపీ అవినాష్ ఫోకస్ పెట్టిన సీబీఐ ఇప్పుడు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిపై దృష్టి సారించింది. ప్రస్తుతం కడప సెంట్రల్ జైల్లో భాస్కర్ రెడ్డిని సీబీఐ ప్రశ్నిస్తోంది. అయితే విచారణ తర్వాత ఆయన్ని అరెస్టు చేస్తారనే ప్రచారం రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అవినాష్ రెడ్డి అనుచరులు భాస్కర్ రెడ్డికి మద్దతుగా పెద్ద ఎత్తున జైలుకు చేరుకున్నారు. అయితే సీబీఐ ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో భాస్కర్ రెడ్డి వెళ్లిన కాసేపటికే బయటకు వచ్చేశారు.

తన అరెస్టుపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తనను అరెస్టు చేస్తే చేసుకోండని దేనికైనా తాను సిద్దమేనని ఘాటుగా స్పందించారు. కేసును పక్కదారి పట్టించొద్దని, వివేకా లేఖ చూస్తే అన్ని విషయాలు బయటపడతాయని ఉద్ఘాటించారు. అధికారులు మరోసారి నోటీసులు ఇస్తామన్నారని, తాము విచారణకు సహకరిస్తామని పేర్కొన్నారు. మరోవైపు అవినాష్ రెడ్డి అరెస్టుపై రేపటితో హైకోర్టు స్టే ముగియనుంది.

అయితే తర్వాత అవినాష్ రెడ్డి ఏం చేస్తారు, భాస్కర్ రెడ్డిపై విచారణ ఎలా ఉండబోతోంది, ఆయన్ని అరెస్టు చేస్తారా అనే విషయాలు చర్చనీయాంశంగా మారాయి.