మార్గదర్శి ఛైర్మన్‌ రామోజీరావుపై సీఐడీ కేసు నమోదు

మార్గదర్శి ఛైర్మన్‌ చెరుకూరి రామోజీరావుపై సీఐడీ కేసు నమోదు చేసింది. మార్గదర్శి ఎండీ చెరుకూరి శైలజ, సంబంధిత బ్రాంచ్‌ మేనేజర్లపై కూడా సీఐడీ కేసు నమోదు చేసింది. సెక్షన్‌ 120బి, 409, 420,477(ఏ) రెడ్‌ విత్‌ 34 ఆఫ్‌ ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదైంది. సెక్షన్‌ 5, ఏపీ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ డిపాజిటర్‌ ఇన్‌ ఫైనాన్షియర్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం కింద కేసు నమోదు చేసింది. ఏ1 నిందితుడిగా చెరుకూరి రామోజీరావు, ఏ2గా చెరుకూరి శైలజ, ఏ3గా సంబంధిత బ్రాంచ్‌ మేనేజర్లను సీఐడీ పేర్కొంది. 1982 చిట్‌ఫండ్‌ చట్టం ప్రకారం కేసు నమోదైంది. విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, పల్నాడు, కర్నూలు, అనంతపురం చిట్స్‌ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌లు సీఐడీకి ఫిర్యాదు చేశారు. అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ల ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. నరసరావుపేట, ఏలూరు, అనంతపురం బ్రాంచ్‌ల మార్గదర్శి ఫోర్‌మెన్‌లు పరారీలో ఉన్నారు. విశాఖ, రాజమండ్రి, ఏలూరు, గుంటూరులో సీఐడీ సోదాలు నిర్వహించింది. ఫోర్‌మెన్‌లను విచారించిన సీఐడీ వారి వాంగ్మూలం నమోదు చేసింది. చిట్‌ ఫండ్‌ నిధులు, మ్యూచువల్‌ ఫండ్‌ను స్పెక్యులేటివ్‌ మార్కెట్‌కి మార్గదర్శి మళ్లించింది. మార్గదర్శిలో పెద్ద ఎత్తున అక్రమాలను ఆడిటింగ్‌లో స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ గుర్తించింది.