త్వరలో బీజేపీలోకి కిరణ్ కుమార్ రెడ్డి…

బీజేపీ రాష్ట్ర, జాతీయ నాయకత్వంతో టచ్ లో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి… ఎన్నికలు దగ్గర పడుతోన్న క్రమంలో ఏపీలో పార్టీని బలోపేతం చేసే దిశగా బీజేపీ అడుగులు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి చివరి ముఖ్యమంత్రిగా చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. త్వరలో బీజేపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా ఆయన తెలంగాణ, జాతీయ రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్‌గా ఉండబోతున్నారని తెలుస్తోంది. ఆయనకు బీజేపీ.. జాతీయ స్థాయిలో కీలక పదవి ఇచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. 2014లో ఏపీ విభజనను వ్యతిరేకిస్తూ… కాంగ్రెస్‌కి గుడ్ బై చెప్పిన… కిరణ్ కుమార్ రెడ్డి.. ఆ తర్వాత సమైక్య ఆంధ్ర పార్టీ పెట్టారు. కానీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లో చేరినా… యాక్టివ్‌గా లేరు. ఇప్పుడు ఆయన బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.