ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లో కోట్ల రూపాయలు దుర్వినియోగం

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. ఈ కేసులో కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని ఈడీ పేర్కొంది.

ఈ కేసులో మొత్తం నలుగురిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్న ఈడీ అధికారులు తెలిపారు, సీమెన్స్ సంస్థ మాజీ ఎండీ సౌమ్యాద్రిశేఖర్ బోస్ అరెస్ట్‌తోపాటు డిజైన్‌ టెక్ ఎండీ వికాస్ వినాయక్, పీవీఎస్‌పీఐడీ స్కిల్ సీఈవో ముకుల్‌చంద్ అగర్వాల్‌, సారా చార్టెర్డ్ అసోసియేట్స్‌కు చెందిన సురేష్‌ గోయల్‌ను అరెస్ట్‌ చేసినట్లు ఈడీ అధికారులు చెప్పారు. నిందితులను విశాఖ ఈడీ కోర్టులో హాజరుపర్చినట్లు అధికారులు వెల్లడించారు.