Andhra Pradesh: ఏపీ స్కిల్ డెవలప్‌ మెంట్ స్కామ్‌లో మరో మలుపు.. శ్రీకాంత్ అర్జాకు సీఐడీ నోటీసులు..

ఏపీ స్కిల్ డెవలప్‌ మెంట్ స్కామ్‌లో మరో మలుపు. ఏపీఎస్‌డీసీ ఎండీగా వ్యవహరించిన శ్రీకాంత్ అర్జాకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. 330 కోట్ల రూపాయల నిధులు దారిమళ్లించిన సూత్రధారులు..

ఏపీ స్కిల్ డెవలప్‌ మెంట్ స్కామ్‌లో మరో మలుపు. ఏపీఎస్‌డీసీ ఎండీగా వ్యవహరించిన శ్రీకాంత్ అర్జాకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. 330 కోట్ల రూపాయల నిధులు దారిమళ్లించిన సూత్రధారులు ఎవరనే కోణంలో ఫోకస్‌ చేస్తున్నారు. అవినీతి సొమ్మును రాబట్టడమే తన లక్ష్యమంటున్నారు సంస్థ చైర్మన్ అజయ్‌రెడ్డి.

ఏపీ స్కిల్ డెవలప్‌ మెంట్ స్కామ్‌లో మరో మలుపు. 330 కోట్ల రూపాయల నిధులు దారిమళ్లించిన సూత్రధారులు ఎవరనే కోణంలో సీఐడీ దర్యాప్తును వేగం చేసింది. నాటి సంస్థ ఎండీ శ్రీకాంత్‌ అర్జాను విచారించాలని అధికారులు నిర్ణయించారు. ఆయనకు నోటీసులు జారీ చేశారు. దీంతో ఈ ఇష్యూ మరోసారి రాజకీయ మంటలకు దారితీసింది. లోకేష్‌ను నేరుగా టార్గెట్ చేశారు వైసీపీ ఎంపీ మార్గాని భరత్.

జగన్‌ ప్రభుత్వం టీడీపీ నాయకత్వంపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తోందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి కౌంటర్. కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పిన తర్వాతే.. సీమెన్స్‌కు ప్రభుత్వ వాటా సొమ్ము చెల్లించారని చెప్తున్నారాయన. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నంగా కొట్టిపారేశారు అచ్చెన్నాయుడు.

అసలేం జరిగిందంటే.. చంద్రబాబు హయాంలో సీమెన్స్‌తో కలిసి శిక్షణ ఇస్తామంటూ 3300 కోట్ల రూపాయల ప్రాజెక్టు చేపట్టారు. ఒప్పందం మేరకు ప్రభుత్వం 10శాతం చెల్లింపులు చేసింది. మిగతా 90 శాతం సీమెన్స్‌ చెల్లించకుండా.. సర్కార్‌ సొమ్మును సైతం షెల్‌ కంపెనీలకు మళ్లించారన్నది అభియోగం. ఎలైట్‌ కంప్యూటర్స్‌, స్కిల్లర్‌ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌, నాలెడ్జ్‌ పోడియం, ఈటీఏ- గ్రీన్స్‌, కేడన్స్‌ పార్టనర్‌ తదితర కంపెనీలకు 240 కోట్లు రూటింగ్‌ అయిందంటున్నారు సంస్థ ప్రస్తుత చైర్మన్ అజయ్‌రెడ్డి.

సీమెన్స్‌ ఓ ఇంటర్నేషనల్‌ కంపెనీ. తమ పేరుతో కొందరు మోసానికి పాల్పడ్డారని ఆ సంస్థ చెప్పిందని అజయ్‌రెడ్డి మాట. ఈ ఆధారాల సాయంతో మరికొందరి అరెస్టులు తప్పవంటున్నారు. ప్రజల సొమ్మును తిరిగి రాబట్టడమే లక్ష్యమంటున్నారు.