ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తాం – కేంద్రమంత్రి గడ్కరీ

ఏపీ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారమందిస్తుందని కేంద్రమంత్రి గడ్కరీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో జాతీయ రహదారులు అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. పారిశ్రామిక అభివృద్ధికి రోడ్ కనెక్టివిటీ పెంచేందుకు రూ.20వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. పోర్టులతో రహదారుల కనెక్టివిటీ బలోపేతం చేస్తామని వెల్లడించారు. అంతేకాదు రాష్ట్రానికి 3పారిశ్రామిక కారిడార్లు వస్తున్నాయని ప్రకటించారు.