బోర్డర్-గావస్కర్ సిరీస్‌లో తొలి టెస్టులో ఘన విజయం సాధించి మంచి జోష్ మీదున్న టీమ్ఇండియా తాజాగా మరో ఘనత సాధించింది.
క్రికెట్‌ను భారతీయులు ఎంతగా ఆదరిస్తారో తెలిసిన విషయమే. భారత క్రికెటర్లను అభిమానులు దేవుళ్లలా భావిస్తారు. టీమ్ఇండియా గెలుపు తమ గెలుపుగా భావిస్తారు. ఇంతటి అభిమానులు ఉన్న మన భారత జట్టు కూడా ప్రస్తుతం క్రికెట్‌లో అందరి అంచనాలకు తగ్గట్టుగానే బాగా రాణిస్తోంది. అభిమానుల అంచనాను వమ్ము చేయకుండా శక్తివంచన లేకుండా పోరాడుతుంది. ఈ క్రమంలోనే టీమ్ఇండియా క్రికెట్ చరిత్రలో మరో రికార్డు హిస్టరీని రిపీట్ చేసింది.
అదేంటంటే బోర్డర్-గావస్కర్ సిరీస్‌లో తొలి టెస్టులో ఘన విజయం సాధించి మంచి జోష్ మీదున్న టీమ్ఇండియా తాజాగా మరో ఘనత సాధించింది. ఇప్పటికే వన్డేలు, టీ20ల్లో అగ్రస్థానంలో భభారత్ తాజాగా ప్రకటించిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆసీస్‌ను వెనక్కినెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ప్రస్తుతం రోహిత్ సేన 115 రేటింగ్ పాయింట్లతో అగ్ర స్థానంలో ఉండగా 111 పాయింట్లతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్ (106), న్యూజిలాండ్ (100), సౌతాఫ్రికా (85) వరుసగా తర్వాతి ర్యాంకుల్లో ఉన్నాయి. అలా టెస్టుల్లో టీమ్‌ఇండియా అగ్రస్థానంలోకి దూసుకెళ్లడంతో అన్ని ఫార్మాట్లలో నంబర్ వన్ జట్టుగా నిలిచింది. కాగా, గతంలో ఝార్ఘండ్డైనమైట్గా క్రికెట్ అభిమానులు పిలుచుకునే ధోనీ నాయకత్వంలో భారత జట్టు ఇలాగే మూడు ఫార్మట్లలో మొదటి స్థానంలో నిలిచింది.