తెలంగాణలో చాపకింద నీరులా బీజేపీ – చుట్టేస్తున్న 600 మంది విస్తారక్‌లు !

అసెంబ్లి ఎన్నికలు దగ్గర పడడంతో తెలంగాణ బీజేపీ ప్రత్యేకంగా విస్తారక్‌లను రంగంలోకి దించింది. పోలింగ్‌ బూత్‌ల పరిధిలో బీజేపీని బలోపేతం చేసే బాధ్యత తోపాటు రాజకీయ వాస్తవ పరిస్థితులను విస్తారక్‌ల ద్వారా బీజేపీ జాతీయ నాయకత్వం అధ్యయనం చేయిస్తోంది. తమకు కేటాయించిన ఆయా మండలా ల్లోని బూత్‌ లకు విస్తారక్‌లు వెళ్లి అక్కడి పార్టీ కమిటీలతో సమా వేశం కానున్నారు. వారి పనితీరుపై పలు సూచనలు చేస్తారు. ఇందు కోసం ఆరు వందల మంది విస్తారక్‌లు తెలంగణకు వచ్చారు. అక్కడ్నుంచి తమకు కేటాయించిన ప్రదేశాలకు వెళ్లారు.

బీజేపీ ఎలక్షనీరింగ్‌లో విస్తారక్‌లది ప్రత్యేక పాత్ర!

బీజేపీ హైకమాండ్ ఇచ్చిన ప్రోగ్రామ్​లను సక్సెస్ చేసే బాధ్యత పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఫుల్ టైమర్ లదే. వీరినే విస్తారక్‌లుఅంటారు. ఆర్గనైజేషన్, ఎలక్టోరల్, పొలిటికల్, సోషల్ అనాలసిస్ చేసి ఎప్పటికప్పుడు రిపోర్ట్ లను విస్తారక్ లు ఇస్తారు. ప్రతి బూత్ లో వాట్సప్ గ్రూప్ లు ఏర్పాటు చేస్తారు. సరళ్ యాప్ ను డౌన్ లోడ్ చేయించి పార్టీ కార్యక్రమాలను వారికి అందుబాటులో ఉంచుతారు. బూత్ కమిటీలు వేయడం.. , ఆ కమిటీ సభ్యులకు అప్పగించిన వర్క్ ను ఫాలో అప్ చేయడం.. శక్తి కేంద్రాల ఇన్​చార్జీలను సమన్వయం చేసుకోవడం వంటివ ిచేస్తూంటారు. మండల అధ్యక్షులతో రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉంటారు. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో విస్తారక్ ల పాత్ర కీలకమని బీజేపీ గురత్ించింది.

హైకమాండ్‌కు స్పష్టమైన నివేదికలు !

భోపాల్‌లో బీజేపీ జాతీయనాయ కత్వం రెండు రోజులపాటు విస్తారక్‌లకు సమగ్ర శిక్షణ అందిం చింది. తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల పరిధిలోని దాదాపు 1040 మండలాల్లో వీరు పర్యటిస్తారు. మండలానికి ఒక విస్తారక్‌ చొప్పున పర్యటించ నున్నారు. హైదరాబాద్‌ జంట నగరాల పరిధి వంటి కొన్నిచోట్ల ఒక విస్తారక్‌ మూడు , నాలుగు మండలాల్లో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. విస్తారక్‌లు బూత్‌ కమిటీలను వెంటబెట్టుకుని ఇంటింటికీ తిరిగి ఓటర్లను కలు స్తారు. కేంద్ర ప్రభు త్వం తెలంగాణ కు కేటాయించిన నిధులు, ప్రజా సంక్షే మ పథకాలను ఓటర్లకు విస్తారక్‌లు వివరించ నున్నారు.

విస్తారక్‌ల నివేదికలతోనే వ్యూహాల ఖరారు

రాష్ట్రంలో రాజకీయ పరి స్థితులు, బూత్‌ స్థాయిలో పార్టీ ఏ మేరకు పటిష్టంగా ఉంది..?, పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలను ఎదుర్కో గలదా..? , నేతలు, కార్య కర్తలకు సూచించాల్సిన వ్యూహం ఏంటీ..? తదితర అంశాలపై విస్తృతంగా విస్తారక్‌లు పర్య టించి పార్టీ జాతీయ నాయకత్వానికి ‘సమ గ్ర నివేదిక సమర్పించ నున్నారు. ఆ నివేదికను రాష్ట్రనాయ కత్వంతో ప్రత్యేక సమావేశంలో చర్చించి అసెంబ్లిd ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని బీజేపీ జాతీయనాయకత్వం ఖరారు చేయనుంది. బీజేపీ విస్తారక్‌లు అంతా నిబద్దతతో ఉంటారు. లో ప్రోఫైల్ మెయిన్ టెియన్ చేస్తారు. తెలంగాణలో బీజేపీకి 36వేల పోలింగ్‌ బూత్‌లు ఉన్నాయి. ఒక్కో బూత్‌లో 21మందితో కమిటీలు కూడా 70శాతం బూతుల్లో ఏర్పాటయ్యాయి. ఈ బూత్‌ల పరిధిలో ఏయే అంశాలు, కారణాల పరంగా కేంద్ర ప్రభుత్వంపై ప్రజలు సానుకూలత, అసంతృప్తి తో ఉన్నారో తెలుసుకోనున్నారు.