ఏపీలో మోదీకి 56 శాతం ప్రజల మద్దతు – సంచలన విషయం బయట పెట్టిన సర్వే !

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రధానిగా ఎవరు ఉండాలని కోరుకుంటున్నారు. ..? దేశం మొత్తం ఎవరు ఉండాలని కోరుకుంటున్నారో వారినే ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే తెలంగాణ కంటే ఏపీలోనే ఎక్కువ మంది ప్రధాని మోదీ పరిపాలనపై ఎంతో నమ్మకంగా ఉన్నారు. మూడో సారి కూడా ఆయనే ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. ఏబీపీ న్యూస్ – సీఓటర్ సంస్థ తాజాగా చేసిన సర్వేలో ఈ విషయం స్పష్టమయింది.

56 శాతం ఆంధ్రులు మోదీ ఫేవరేట్

ప్రధాని మోదీ పరిపాలనా శైలికి ఫిదా కాని వారు ఎవరు ఉంటారు ?. ఏపీ ప్రజల్లో 56 శాతం మంది ఆయన పాలనా తీరును సమర్థించి మళ్లీ ప్రధాని కావాలనుకుంటున్నారు. దేశంలో అత్యంత కీలకమైన, ఖచ్చితమైన సర్వేలు అందిస్తుందని రికార్డు ఉన్న సీఓటర్ సంస్థ ఏబీపీ న్యూస్ నెట్ వర్క్ తో కలిసి చేసిన ఒపీనియన్ పోల్ లో ఈ విషయం స్పష్టమయింది. మోదీ పేరును 56 శాతం మంది అంగీకరించారు. తెలంగాణలో ఈ పర్సంటేజీ యాభై శాతం మాత్రమే ఉంది. అంటే.. . తెలంగాణ కంటే ఏపీలో మోదీకి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నట్లు అన్నమాట.

రాహుల్‌ కు మద్దతు తక్కువే

దక్షిణాదిలో మోదీకి మద్దతు లేదని కొంత మంది ప్రచారం చేస్తూ ఉంటారు. అయితే ప్రధానిగా మోదీకే ఎక్కువ మంది మద్దతు తెలుపుతున్నారు. ఏపీలో యాభై ఆరు, తెలంగాణలో యాభై శాతం మంది మోదీకి మద్దతు తెలుపుతూంటే.. రాహుల్‌కు మాత్రం ఏపీలో 34 శాతం.. తెలంగాణలో 40 శాతం మంది మాత్రమే అనుకూలంగా ఉన్నారు. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా లోక్ సభ ఎన్నికలు.. కేంద్రంలో ఎవరు పరిపాలన చేయాలన్న దానిపై మోదీకే ఎక్కువగా మద్దతు తెలుపుతున్నారు.

మోదీ క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటున్న ఏపీ ప్రాంతీయ పార్టీలు

మోదీకి అంత భారీగా మద్దతు ఉంటే బీజేపీ ఎందుకు ఏపీలో ఎదగలేకపోతోందని కొంత మందికి డౌట్ వస్తుంది. ఈ ప్రశ్నలోనే సమాధానం ఉంది. మోదీని వ్యతిరేకించే పార్టీ ఏపీలో ఉందా ?. లేనే లేదు. మూడు ప్రాంతీయ పార్టీలు మోదీ పాలనను ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటాయి. టీడీపీ, వైసీపీ, జనసేన మూడు పార్టీలు మోదీ పాలన ఉండాలని కోరుకుంటున్నాయి. అందరూ మోదీకి సపోర్టు చేస్తూ… వ్యూహాత్మకంగా అయినా బీజేపీని ఎదగకుండా చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఏదైతేనేం.. మోదీ పరిపాలనకు ఏపీ ప్రజలు పట్టం కట్టబోతున్నారని మాత్రం స్పష్టమవుతోంది.