20 కోట్ల ముస్లింలు – విద్యావంతులే ఎక్కువ ! మరి వివక్ష తప్పుడు ప్రచారమేనా ?

దేశంలో ముస్లింల జనాభా 20 కోట్లకు చేరుకుంటుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పార్లమెంట్ లో తృణమూల్ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సమాధానం ఇచ్చారు. 2023 నాటికి భారతదేశంలో ముస్లిం జనాభా 19.7 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి స్మృతి ఇరానీ లోక్‌సభలో తెలిపారు. దేశంలో బాగా జనాభా పెరుగుతున్న వివిధ రకాల మతాల్లో ముస్లిం జనాభా అత్యధికం.

అక్షరాస్యత లేటు ముస్లింలలో ఎక్కువ

2011 జనాభా లెక్కల ప్రకారం ముస్లిం సమాజం మొత్తం జనాభాలో 14.2 శాతంగా ఉందని, లేబర్ ఫోర్స్ సర్వే డేటా ప్రకారం ఏడు సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సున్న ముస్లింలలో అక్షరాస్యత రేటు 77.7 శాతం కాగా, శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు 35.1 శాతంగా ఉందని వివరించారు. అంటే. ముస్లింలు అటు చదువుల్లోనూ ఇటు ఉద్యోగ ఉపాధి రంగాల్లోనూ మెరుగైన అవకాశాలు పొందుతున్నారన్నమాట.

ప్రభుత్వ పథకాల్లో అత్యధిక లబ్దిదారులు

లోక్​సభలో తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ఎంపీ మాలా రాయ్ అడిగిన ప్రశ్నలకు స్మృతి ఇరానీ సమాధానమిస్తూ, 2023లో దేశ జనాభా అంచనా 138.8 కోట్లుగా అంచనా వేశారని, ప్రభుత్వం అదే నిష్పత్రిలో 14.2 తీసుకుని పరిశీలిస్తే ముస్లిం జనాభా 19.7 కోట్లకు చేరుకుందన్నారు. ఇక.. ముస్లిం సమాజానికి సంబంధించిన వివిధ సామాజిక-ఆర్థిక సూచికల గురించి మంత్రి తెలియజేస్తూ.. 2021-22లో స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ నిర్వహించిన PLFS ప్రకారం, 94.9 శాతం మంది ముస్లింలు మెరుగైన తాగునీటి వనరులను కలిగి ఉన్నారని తెలిపారు. 97.2 శాతం మంది మెరుగైన టాయిలెట్ సౌకర్యాలను పొందారని వివరించారు. అన్ని రాష్ట్రాల్లోనూ సంక్షేమ పథకాల్లో వారే అత్యధికంగా లబ్దిపొందుతున్నారు. దాదాపుగా 90 శాతానికిపై కటుంబాలు అన్ని వర్గాలు కట్టే పన్నులతో ప్రయోజనం పొందుతున్నారు.

ఆర్థికంగా బలపడుతున్న ముస్లిం సమాజం

50.2 శాతం ముస్లిం కుటుంబాలు మార్చి 31, 2014 తర్వాత మొదటిసారిగా కొత్త ఇళ్లు లేదా ఫ్లాట్లను కొనుగోలు చేయడమో, నిర్మించుకోవడం జరిగిందని కేంద్రం లెక్కల్లో వెల్లడయింది. ముస్లింల సామాజిక-ఆర్థిక స్థితి మెరుగుపడింది.

దేశంలో గత తొమ్మిదేళ్లలో ముస్లింలు వివక్షకు గురవుతున్నారంటూ… ఎన్నో నిందలు వేశారు. అంతర్జాతీయంగా దేశం పరువు తీసేందుకు ప్రయత్నించారు. కానీ అసలు నిజం ఏమిటో గణాంకాలు వివరిస్తున్నాయి. బీజేపీపై నిందలేయడం ద్వారా కొన్ని పార్టీలు రాజకీయలబ్ది పొందుతున్నాయి. ఈ రాజకీయ కుట్రలో మజ్లిస్ లాంటి ముస్లిం పార్టీలు భాగమవుతున్నాయి.