10 అసెంబ్లీ , 6 లోక్‌సభ – బీజేపీ ప్రాధాన్యతను గుర్తించినట్లేనా ?

ఆంధ్రప్రదేశ్ లో సీట్ల సర్దుబాటు ప్రకటన పూర్తయింది. బీజేపీకి ఆరు పార్లమెంట్ సీట్లతో పాటు పది అసెంబ్లీ సీట్లను ఇవ్వాలని టీడీపీ, జనసేన నిర్ణయించుకున్నాయి. అయితే చాలా మంది బీజేపీకి గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం ఆధారంగా ఇన్ని సీట్లా అనే విమర్శలు చేస్తున్నారు. నిజానికి రాజకీయ పార్టీల బలం ఓట్ల శాతంగా మాత్రమే నిర్ణయించలేరని అంరికీ తెలుసు. కానీ కొంత మంది కావాలనే విమర్శలు చేస్తున్నారు.

ఫలితాలను నిర్ణయించే శక్తి మోదీ ఆకర్షణకు ఉంది !

టీడీపీ, జనసేన పార్టీలు మాత్రం బీజేపీ బలాన్ని పూర్తి ఓట్ల షేర్ తోనే కొలవడంలేదు. సీట్ల పంపకాల దగ్గరకు వచ్చే సరికి బీజేపీ బలం గురించి ఎక్కువ మంది చర్చిస్తున్నారు. ఆ పార్టీకి ఒక శాతం కంటే తక్కువ ఓట్లు ఉన్నాయని.. అందువల్ల ఆ పార్టీకి పది అసెంబ్లీ.. ఆరు పార్లమెంట్ సీట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని వాదిస్తున్నారు. మిగతా రెండు పార్టీలు ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నాయని అంటున్నారు. కానీ రాజకీయ పార్టీ బలాన్ని కేవలం ఓట్ల షేర్ ద్వారా అంచనా వేయడం అంటే.. తప్పులో కాలేసినట్లేనని టీడీపీ, జనసేన అభిప్రాయం. మరోసారి అధికారంలోకి వచ్చే పార్టీ బీజేపీ.. అంతకు మించి తిరుగులేని శక్తి మోదీ. వారి నీడలో ఎన్నికలుక వెళ్తే గెలుపు ఖాయమని ఎక్కువ మంది అభిప్రాయం.

ఖచ్చితంగా గెలిచే పార్టీ బీజేపీ

ప్రజాస్వామ్యంలో తర్వాత ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చెప్పలేం కానీ ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఏపీలో గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసం నుంచి కోలుకోవాలంటే సామాన్యమైన విషయం కాదు. పోలవరం ఆపేశారు. రాజధానిని పడుకోబెట్టేశారు. కనీసం రోడ్ల మరమ్మతులు చేయలేదు. కానీ ఐదు వందల కోట్లతో విలాసవంతమైన ప్యాలెస్ కట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే కేంద్రం సహకారం చాలా అవసరం. ఉత్తినే కూటమిలో ఉండి సాయం చేయమంటే బీజేపీ కూడా చేసే అవకాశం ఉండదు. ఇప్పుడు గౌరవప్రదమైన స్థానాలను.. ఇవ్వడం వల్ల ఏపీకి కేంద్రం కూడా సాయం చేస్తుంది.

రాజకీయాలు రాష్ట్రం కోసమే !

రాజకీయాలంటే.. ఓట్ల లెక్కలు మాత్రమే కాదు. రాజకీయాలు చేసేది రాష్ట్రం కోసమే. ముఖ్యంగా టీడీపీ, జనసేన మొదటి నుంచి చెబుతోంది.. రాష్ట్రాన్ని రాక్షసుల బారి నుంచి కాపాడటానికేనని చెబుతున్నాయి. మా బలం ఇంతా….అని టీడీపీ పట్టుదలకు పోతే.. అసలు పొత్తులే ఉండేవి కావు. జనసేన పార్టీ అధినేతపై ఉండే ఒత్తిడి గురించి చెప్పాల్సిన పని లేదు. చివరికి బాలానికి తగ్గట్లే సీట్లు కేటాయింపు జరిగింది. ఇదీ అసలైన వాస్తవం.