మూడు రాజధానులు ఉండాల్సిందే : అంబటి రాంబాబు

విజయవాడ : గతంలో ఎదురైన సమస్యలు మళ్లీ పునరావృతం కాకూడదంటే మూడు రాజధానులు ఉండాల్సిందేనని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మూడు ప్రాంతాల సమతుల్య అభివృద్ధి మూడు రాజధానులతోనే సాధ్యమని, మూడు రాజధానులకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మూడు ప్రాంతాలను సమానంగా చూడాలనేదే తమ అభిమతమని చెప్పారు. గతంలో పూర్తి అభివృద్ధి హైదరాబాద్ లోనే జరిగిందని, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ వంటి గొప్ప ప్రదేశాన్ని వదులుకోవాల్సి వచ్చిందని అన్నారు. మరోసారి ఇలాంటి అనుభవం ఎదురుకాకుండా ఉండాలంటే అన్ని చోట్ల అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఉత్తరాంధ్రకు ఒక రాజధాని, కోస్తాంధ్రకు ఒక రాజధాని, రాయలసీమను ఒక రాజధాని ఇవ్వడం వల్ల అన్ని ప్రాంతాల ప్రజలు సంతృప్తిగా ఉంటారని తెలిపారు. ఏ ప్రాంతం కూడా అభద్రతాభావంతో ఉండకూడదనే సదుద్దేశంతోనే మూడు రాజధానుల పాలసీని తీసుకొచ్చామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *