అమరావతి : ఏపీ రాజధాని అంశంలో వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు వస్తుండడంతో మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పందించారు. శివరామకృష్ణ కమిటీ నివేదిక ఆధారంగా వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల అమలు చేపట్టిందని వెల్లడించారు. గత ప్రభుత్వం రాజధానిపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను బుట్టదాఖలు చేసిందని ఆరోపించారు. పెట్టుబడులు అన్నీ ఒకే ప్రాంతంలో పెడితే ప్రాంతాల మధ్య అసమానతలు ఏర్పడతాయని, అందుకే మూడు రాజధానులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. మూడు ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాన్నే సీఎం జగన్ అమలు చేస్తున్నారని ధర్మాన స్పష్టం చేశారు. మూడు రాజధానుల అంశం విస్తృత ప్రయోజనాలతో కూడుకున్నదని తెలిపారు. గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Related Posts
చంద్రబాబు ప్రభుత్వంలో బీజేపీ, జనసేన ఉంటాయా ?
ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా ఉన్నాయి. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు. మరి కూటమిగా పోటీ చేసిన జనసేన, బీజేపీ ప్రభుత్వంలో చేరుతాయా లేకపోతే.. బయట నుంచి…
బీజేపీ కూటమిలోకి వచ్చినప్పుడే విజయం – ఏపీ ఫలితాలు చెప్పింది ఇదే
చంద్రబాబుకు ఒంటరిగా గెలిచిన రికార్డే లేదు.. ఈ సారి ఆయన ఘోరంగా ఓడిపోతారు అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2019 ఎన్నికల సమయంలో ఏపీలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో…
పథకాల కన్నా ఎక్కువ నష్టం చేసింది అధికార దుర్వినియోగమే – ఆ తప్పును గుర్తించలేకపోయిన వైసీపీ !
2019లో 151 సీట్లు 50 శాతం ఓట్లతో తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలోనే ప్రజావిశ్వాసం కోల్పోయారు. పది శాతానికిపైగా ఓట్లను కోల్పోయారు. అధికారాన్ని…