బంగారు భారత్ – మోదీ హయాంలో గోల్డెన్ ఇండియా ఆవిష్కరణ

1991 సంవత్సరంలో దేశంలో దిగుమతి చేసుకోవడానికి విదేశీ కరెన్సీ లేదు. అప్పుడు భారతదేశం తన 67 టన్నుల బంగారాన్ని తనఖా పెట్టి 2.2 బిలియన్ డాలర్ల రుణం తీసుకుంది. బంగారాన్ని తనఖా పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముంబై విమానాశ్రయంలో చార్టర్ విమానం బంగారంతో ఇంగ్లండ్‌కు వెళ్లింది. అప్పుడు భారతదేశం ఇంగ్లండ్ నుంచి రుణం పొందింది. కానీ ఇప్పుడు లక్ష కిలోలను ఇండియాకు తీసుకు వచ్చింది.

లండన్ నుంచి ఇండియాకు లక్ష కిలోల బంగారం

వంద టన్నుల బంగారం.. అంటే.. లక్ష కిలోలు. ఇంత భారీ స్థాయిలో బంగారం ఇంగ్లండ్‌ నుంచి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఖజానాకు చేరింది. 1991 తర్వాత ఇంత పెద్ద మొత్తంలో దేశానికి బంగారాన్ని తరలించడం ఇదే తొలిసారి. చాలా దేశాల్లోని కేంద్ర బ్యాంకులు బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌లో తమ బంగారాన్ని నిల్వ చేస్తుంటాయి. భారత్‌ ఇదే చేసింది. 15 ఏళ్ల క్రితం అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి 200 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. పైగా కొన్నేళ్లుగా పెద్ద ఎత్తున పుత్తడిని కొనుగోలు చేస్తూ వచ్చిన ఆర్బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌లో నిల్వచేస్తూ వస్తోంది.

కొన్నేళ్లుగా భారీగా బంగారం కొనుగోలు చేస్తున్న భారత్

2023లో 27.5 టన్నుల పసిడిని కొత్తగా నిల్వలో చేర్చింది. ఈ ఏడాది జనవరి-ఏప్రిల్‌ వ్యవధిలోనే నిరుడు కంటే ఒకటిన్నర రెట్లు అధిక బంగారాన్ని కొనుగోలు చేసింది. వీటిలో ఇంగ్లండ్‌ నుంచి 100 టన్నుల బంగారాన్ని తరలించేందుకు ప్రత్యేకంగా కొన్నినెలల పాటు కసరత్తు చేసి భారీ భద్రత నడుమ ప్రత్యేక విమానంలో భారత్‌కు తరలించారు. అనేక దేశాల కేంద్ర బ్యాంకులు బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌లో తమ బంగారాన్ని నిల్వ చేస్తుంటాయి. భారత్‌ కూడా అక్కడి డిపాజిటరీల్లో పెద్దఎత్తున పసిడిని నిల్వ చేస్తూ వచ్చింది. ఆర్‌బిఐకి చెందిన సగానికి పైగా బంగారం నిల్వలు విదేశాలలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్‌ల వద్ద సురక్షితంగా ఉన్నాయి.

భారత్ వద్ద 822.1 టన్నుల బంగారం నిల్వలు

2024 మార్చి ముగింపు నాటికి భారత్‌ వద్ద 822.1 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. దీంట్లో 413.8 టన్నులు ఇతర దేశాల్లో నిల్వ చేసి ఉంచింది. బంగారం నిల్వ చేసినందుకు బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌కు ఆర్‌బిఐ రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. తాజా తరలింపునతో ఆర్‌బిఐకి కొంత నిర్వహణ వ్యయాలు తగ్గనున్నాయి. దేశంలో ముంబై, నాగ్‌పూర్‌లోని మింట్ రోడ్‌లోని ఆర్‌బిఐ బిల్డింగ్‌లో ఉన్న సేఫ్‌లలో బంగారాన్ని ఉంచుతారు. గ్లోబల్ సెంట్రల్ బ్యాంకులు ఇప్పటివరకు తవ్విన మొత్తం బంగారంలో 17 శాతం కలిగి ఉన్నాయి. 2023 చివరి నాటికి నిల్వలు 36,699 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువగా ఉంటాయి.