ఇద్దరు సీఎం అభ్యర్థుల్ని ఓడిస్తున్న బీజేపీ నేత – ఈయన స్పెషల్ ఎంటో తేలుసా ?

బీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గంతో పాటు , కామారెడ్డి లోను పోటీ చేస్తున్నారు. కేసిఆర్ కు పోటీగా కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి, బిజెపి నుంచి కాటిపల్లి వెంకటరమణ రెడ్డి పోటీ చేశారు. దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ లోనే కాదు.. ప్రజా ఎగ్టిట్ పోల్స్ లోనూ ఒకేట మాట వినిపించింది. అదేమిటంటే.. కామారెడ్డి లో ఈ సారి బీజేపీ జెండా ఎగరబోతోందని. ఆశ్చర్యం అనిపించినా ఇది నిజం.

బీఆర్ఎస్ ఆశలు గల్లంతు

కేసీఆర్ కామారెడ్డిలో ఎందుకు పోటీ చేస్తున్నారో ఎవరికీ తెలియదు. కాంగ్రెస్ కీలక నేత రేవంత్ రెడ్డిని ఆయనపై కాంగ్రెస్ హైకమాండ్ నిలబెట్టింది. బీఆర్ఎస్ కూడా రేవంత్ తో పాటు బిజెపి అభ్యర్థి వెంకట రమణారెడ్డి మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి అది తమకు లాభం చేకూరుస్తుందనే అంచనాలు వేసుకుంది. కేసీఆర్ తల్లి పుట్టిన ఊరు ఆ నియోజకవర్గంలో ఉందని.. బంధువులు చాలా మంది ఉన్నారని అనుకున్నారు. కానీ ప్రచారం ముందుకు జరిగిన కొద్దీ తాము ఎంత తప్పు చేశామో బీఆర్ఎస్ నేతలకు అర్థమయింది.

ప్రజా నేతగా ఎదిగిన బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి

బీజేపీ నుంచి పోటీ చేసిన్న జడ్పీ మాజీ చైర్మన్ కాటేపల్లి వెంకటరమణారెడ్డి ఈ నియోజకవర్గంలో గత నాలుగైదు ఏళ్లుగా నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటాలు చేపడుతూ వచ్చారు. వాటికి నాయకత్వం వహిస్తున్నారు .డ్వాక్రా మహిళలకు రావలసిన వడ్డీ రాయితీ డబ్బుల కోసం, కామారెడ్డి మాస్టర్ ప్లాన్ తో రైతులకు భారీ నష్టం జరుగుతోందని ఆందోళన చేపట్టిన రైతుల కోసం ఈయన అండగా నిలబడి ఉద్యమానికి నాయకత్వం వహించడం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు కేటాయించాలని పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం , ఇలా అనేక ప్రజా ఉద్యమాలతో జనంలో మంచి పేరు ప్రఖ్యాతలు వెంకటరమణారెడ్డి సంపాదించుకున్నారు .

కరోనాలో ప్రజల్ని ఆదుకున్న ఏకైక నేత

కామారెడ్డిలో కరోనా సమయంలో ప్రజల్ని ఎవరూ ఆదుకోలేదు. ప్రభుత్వం కూడా ఆదుకోలేదు. కానీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి కనీసం యాభై కోట్లు ఖర్చు పెట్టి ప్రజల కనీస అవసరాలు తీర్చారు.
తనకు స్థానికుల ఓట్లు భారీగా పడతాయని తాను తప్పకుండా గెలుస్తాననే ధీమాతో వెంకటరమణారెడ్డి ఉన్నారు.ఈ మేరకు 150 కోట్లతో సొంత మ్యానిఫెస్టోను అమలు చేస్తానని ఇప్పటికే హామీ ఇచ్చారు.దీంతో అటు కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి కంటే బిజెపి అభ్యర్థి వెంకటరమణారెడ్డి నుంచి పోటీ తీవ్రంగా ఇచ్చారు. చివరికి ఆయనదే గెలుపని అందరూ తీర్మానించారు.

ఒకరు సిట్టింగ్ సీఎం.. మరొకరు సీఎం అభ్యర్థి అయినా వారిద్దర్నీ ఒంటిచేత్తో ఓడించిన నేతగా.. కాటిపల్లి వెంకటరమణారెడ్డి రికార్డు సృష్టించనున్నారు.