ఆదిలాబాద్‌లో త్రిముఖ పోటీ – బీజేపీకి అడ్వాంటేజ్ ?

ఆదిలాబాద్ నియోజకవర్గానికి ఈసారి జరగబోయే ఎన్నికల్లో త్రిముఖ పోటీ కనిపిస్తోంది. పోటీ గత రెండు ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్యనే సాగింది. ఈ సారి కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. అయితే జోగు రామన్న వ్యవహారశైలిపై ప్రజల్లో అసంతృప్తి ఏర్పడింది. రెండు సార్లు ఓడిన బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ నే మళ్లీ అభ్యర్థిగా నిలబడ్డారు. దాందో ఆయనకు ఓ చాన్స్ ఇవ్వాలన్న అభిప్రాయం ప్రజల్లో పెరుగుతోంది.

రెండు సార్లు బీజేపీ అభ్యర్థిపై గెలిచిన జోగు రామన్న

ప్రస్తుతం ఎమ్మెల్యేగా జోగురామన్న ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీపాయిగూడ సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. సర్పంచ్‌గాగా జైనథ్ ఎంపిపిగా, జడ్పీటీసీగా, ఆదిలాబాద్ నియోజకవర్గం నుండినాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు జోగు రామన్న . 2014ఎన్నికలలో 14,711 ఓట్ల మెజారీటీతో, 2018లో 26,606 ఓట్ల మెజారిటీతో జోగురామన్న బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్‌పై విజయం సాదించారు. అయితే నియోజకవర్గంలో మున్నూరు కాపు సామాజిక ఓటర్లు మెజారిటీ ఓట్లు ఉన్నాయి. ఈ సామాజిక ఓట్లు గెలుపు ఓటములను నిర్ణయిస్తాయి. అదే సామాజిక వర్గానికి చెందిన రామన్నకు సోంత సామాజికవర్గం అండగా నిలుస్తున్నారు. గంపగుత్తగా ఓట్లు వేస్తున్నారు. కానీ ఈ సారి ఆ సామాజికవర్గం ఓటర్లు బీఆర్ఎస్‌కు దూరమయ్యారు. బండి సంజయ్ .. ఆ ఓటర్లను బీజేపీకి దగ్గర చేశారు. దీంతో జోగు రామన్న పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.

పెండింగ్‌లో అభివృద్ది పనులు

నియోజకవర్గంలో కొన్ని అభివృద్ధి పథకాలు పూర్తి కాలేదు. చెనాక కోరాట పనులు చివరి దశకు చెరుకున్నాయి. ఎత్తి పోతల పథకంకు నీరు అందించాలంటే ప్రధాన కాల్వ పూర్తయినా… డిస్ట్రిబ్యూషన్ కాల్వలు పూర్తి కాలేదు. దాంతో ఎప్పుడు నీరు అందిస్తారో తెలియని పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఇటీవల తర్నామ్ అంతరాష్ట్ర రహదారిపై బ్రిడ్జి బీటలు వారింది. ప్రమాదకరమైన స్థితికి చేరడంతో వాహనాల రాకపోకలు నిలిపి వేశారు. రవాణ సౌకర్యాలు నిలిపి వేయడంతో జైనథ్, బేల మండలాల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం నిదులు మంజూరు చేయించారు. కానీ పనులు ప్రారంభం కాలేదు. ఇది రామన్నకు ఇబ్బందిగా మారింది. బీఅర్ఎస్ నాయకులు కబ్జాలు చేయడం రామన్నకు చెడ్డపెరు తెచ్చింది. జిల్లా కేంద్రంలో సీసీఐ సిమెంట్ పరిశ్రమ ఉంది. ఈ పరిశ్రమను తెరిపిస్తామని రామన్న ఎన్నికల హమీ ఇచ్చారు. కానీ తెరిపించలేకపోయారు. కేంద్రంపై నిందలేయాలని ప్రయత్నించి ప్రజల ఆగ్రహానికి గురయ్యారు.

దూకుడుగా బీజేపీ అభ్యర్థి పాయల శంకర్

నాలుగు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాదించిన రామన్న కోటను బద్దలు చేయాలని కమలం పార్టీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే రామన్నపై బిజెపి అభ్యర్థిగా పాయల్ శంకర్ మూడు సార్లు ఓటమి పాలయ్యారు. ఈసారి ఆరునూరైనా విజయం సాధించాలని పాయల్ భావిస్తున్నారు. ఈ మేరకు ప్రచారం కూడా ప్రారంభించారు. సానుభూతి అస్త్రంతో ఈ సారి గెలవాలని ప్రయతనిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఎన్ఆర్‌ఐ కంది శ్రీనివాస్‌రెడ్డి బిజెపి నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకే టిక్కెట్ ఇచ్చారు. ఆయన కుక్కర్లు పంచుతూ గెలుద్దామని అనుకుంటున్నారు. ఎలా చూసినా ఆదిలాబాద్ లో ఈ సారి బీజేపీకి అడ్వాంటేజ్ ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.